సాగో అనే పేరుతో ప్రాచుర్యం పొందిన సగ్గుబియ్యంను కర్ర పెండలం నుంచి తీసుకున్న పొడితో తయారు చేస్తారు.ఈ సగ్గుబియ్యంను పాయంసంగా,ఉప్మాగా తయారు చేసుకుని తింటారు.వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండి.ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవాళ్లకు సగ్గుబియ్యం సరైన ఆహారం అని చెప్పవచ్చు.ఇది రసాయనాలు లేని న్యాచురల్ ఫుడ్ కావడం వల్ల చాలమంది సగ్గు బియ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.అంతేకాకుండా సగ్గుబియ్యంలో అనేక ఆరోగ్య రహస్యాలు దాగున్నాయని ఎందరో ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇందులో ప్రోటిన్స్‌తో పాటుగా,క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.కాబట్టి కండరాల గ్రోత్ తో పాటు,బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేయడం,బ్లడ్ కొలెస్ట్రాల్ ని మెరుగుపరచదంతో పాటు వీటిలో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉండటం వల్ల రక్తప్రసరణ సజావుగా సాగి గుండె సంబంధింత వ్యాధులు రాకుండా చేస్తుంది.మొత్తంగా సగ్గుబియ్యం చాల హెల్తీఫుడ్ గా చెప్పవచ్చు.ఇక ఈ సగ్గు బియ్యంతో పూర్ణాలు చేసుకొని తింటే అబ్బా ఆ రుచే వేరనిపిస్తుంది..అందుకే మీకోసం సగ్గుబియ్యం పూర్ణాలు ఎలా తయారు చేయాలో చెబుతున్నా,ఈ టేస్టీ వంటకాన్ని ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి..



దీని తయారికి కావల్సిన వస్తువూలు.: మినప్పప్పు,3 కప్పులు.బియ్యం,ఆరు కప్పులు.సగ్గుబియ్యం సన్నవి,కప్పు.ఎండుకొబ్బరి తురుము.పావుకప్పు.పంచదార కప్పు.అటుకుల పొడి,పావుకప్పు. యాలకుల పొడి,టీస్పూను.నూనె వేయించడానికి సరిపడా.ఈ ఐటెంస్ అన్ని రెడి చేసుకున్నాక తయారి విధానాన్ని చూద్దాం..




తయారుచేసే విధానం :ముందుగా మినప్పప్పు,బియ్యం నాలుగు గంటలపాటు నానబెట్టాలి.నానాక సరిపడా నీటితో మరీ గట్టిగానూ పలుచగానూ కాకుండా పూర్ణాలకోసం రుబ్బినట్లే మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.ఆ తర్వాత పాన్‌లో మూడు కప్పుల నీళ్లు పోసి కాగాక సగ్గుబియ్యం వేసి ఉడికించాలి.అవి ఉడికిన తరవాత పంచదార,యాలకులపొడి వేసి కలిపి మరోసారి కాసేపు ఉడికించాలి.ఓ గిన్నెలో ఉడికించిన సగ్గుబియ్యం మిశ్రమం,ఎండు కొబ్బరి తురుము,అటుకులపొడి వేసి ముద్దగా కలపాలి.అలా కలిపిన ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దల్లా చేసి ముందుగా గ్రైండ్‌ చేసుకున్న మినప్పప్పు,బియ్యం పిండి మిశ్రమంలో ముంచి కాగిన నూనెలో ఎర్రగా వేయించి తీయాలి అంతే వేడి వేడి పూర్ణాలు రెడి..

మరింత సమాచారం తెలుసుకోండి: