కావల్సిన ప‌దార్థాలు : 
రొయ్యలు-పావుకేజీ, 
గోంగూర-పావుకేజీ, 
పచ్చిమిర్చి-7
పసుపు-అర టీస్పూను,


ఉప్పు- త‌గినంత‌,
కారం-ఒక టీస్పూను, 
కరివేపాకు-2 రెమ్మలు, 
చింతపండు- ఒక టీస్పూను, 
జీలకర్ర-పావు టీస్పూను, 


వెల్లుల్లి-ఎనిమిది, 
మినపప్పు-ఒక టీస్పూను, 
ఆవాలు-పావు టీస్పూను, 
ఎండు మిర్చి-ఒకటి, 
నీరు-కొద్దిగా
నూనె- మూడు టీస్పూన్లు.


త‌యారీ విధానం: ముందుగా స్టౌ వెలిగించి కుక్కర్‌ పెట్టి నీరు పోసి అందులో గోంగూర వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, చింతపండు, ఉప్పు వేసి కుక్కర్‌లో నాలుగు లేదా ఐదు విజిల్స్‌ వచ్చేంత వరకు ఉంచాలి. తర్వాత దాంట్లో కారం, వేసి కలుపుకోవాలి. 


మరో కడాయి పెట్టి నూనె, వెల్లుల్లి, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, రొయ్యలు ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా వేయించుకోవాలి. దీంట్లో ఉడకబెట్టిన గోంగూర వేసి బాగా కలపాలి. తర్వాత ఉప్పు కారం రుచికి తగినంత వేసుకుని బాగా కలిపి ఉడకనివ్వాలి. అంతే నోరూరించే గోంగూర రొయ్యలు క‌ర్రీ రెడీ...


రొయ్యలు చిన్నవైనా బలవర్థకమైనవి. రుచికరమే గాక, ఆరోగ్యాన్నిచ్చేవి. తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రొటీన్లు రొయ్యల ద్వారా పొందవచ్చు. గోంగూరలో విటమిన్ ఎ, బి 1, బి 2, బి 9 తోపాటు సి విటమిన్ కూడా అధిక మొత్తంలో ఉంటాయి. రొయ్యలు చాలా సులువుగా కూడా జీర్ణమవుతాయి. ఈ రెండిటి కాంబినేష‌న్లో ఈ క‌ర్రీ తిన‌డం వ‌ల్ల చాలా మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: