కావలసిన ప‌దార్థాలు: 
బీట్‌రూట్‌ తురుము: 3 కప్పు, 
బొంబాయిరవ్వ: ముప్పావుకప్పు, 
నెయ్యి: 6 టేబుల్‌స్పూన్లు, 
పంచదార: రెండు కప్పులు, 


మంచినీళ్లు: ఒక‌టిన్న‌ర‌ కప్పులు, 
ఎండుద్రాక్ష: కొద్దిగా, 
యాలకులపొడి: అరటీస్పూను
జీడిపప్పు: కొద్దిగా, 
బాదంప‌ప్పు: 8


తయారుచేసే విధానం: 
ముందుగాబీట్‌రూట్ తొక్క‌ తీసి సన్నగా తురమాలి. పాన్‌లో టేబుల్‌స్పూను నెయ్యి వేసి, బొంబాయిరవ్వ వేసి  ఐదు నిమిషాలు వేయించి తీసి, ఆరనివ్వాలి. అదే పాన్‌లో మరో టీస్పూను నెయ్యి వేసి సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు వేసి వేయించాలి. తరవాత ఎండుద్రాక్ష కూడా వేసి వేగాక అన్నీ తీసి పక్కన ఉంచాలి. ఇప్పుడు అదే బాణలిలో మిగిలిన నెయ్యి, బీట్‌రూట్‌ తురుము వేసి మీడియం ఫ్లేమ్‌లో అది సగమయ్యేవరకూ సుమారు పది నిమిషాలపాటు ఉడికించాలి. 


ఇప్పుడు వేయించిన బొంబాయిరవ్వ కూడా వేసి బాగా కలపాలి. తరవాత మంచినీళ్లు, పంచదార వేసి కలిపి  మూతపెట్టి మీడియం మంటమీద నీరంతా ఆవిరయ్యేవరకూ ఉడికించాలి. తరవాత యాలకులపొడి, వేయించిన జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష అన్నీ వేసి కలిపి దించాలి. అంతే ఎంతో స‌లువుగా బీట్‌రూట్ హ‌ల్వా రెడీ..


బీట్‌రూట్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్ స‌హాయ‌ప‌డుతుంది. అనేక ర‌కాల పోష‌కాలు, ఖ‌నిజాలు ఉన్న బీట్‌రూట్ తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంత మేలు స‌మ‌కూర్చుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: