కావాల్సిన ప‌దార్ధాలు:
మీల్‌ మేకర్‌ – అర కప్పు, 
శెన‌గపిండి – అర కప్పు, 
మొక్కజొన్న పిండి – అర కప్పు, 
బియ్యప్పిండి – అర కప్పు , 


నిమ్మరసం – 2 టీ స్పూన్లు, 
అల్లం వెల్లుల్లి పేస్టు – 2 టీ స్పూన్లు, 
ఉల్లిపాయ తరుగు – 1 కప్పు, 
కారం – అర టీ స్పూన్, 
ఉప్పు – తగినంత


నూనె – డ్రీప్‌ ఫ్రైకి సరిపడా,
 నీళ్లు – కొద్దిగా, 
ఉప్పు – తగినంత


త‌యారీ విధానం: 
ముందుగా నీళ్లను వేడి చేసి అందులో మీల్‌ మేకర్‌ వేసుకుని పది లేదా పదిహేను నిమిషాల పాటూ నానబెట్టుకోవాలి. కొంత స‌మ‌యం ఉంచిన తర్వాత మీల్‌ మేకర్స్ నీళ్లు పిండుకోవాలి.  మీల్‌ మేకర్స్‌ను  మిక్సీలో వేసి తురుముకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని అందులో మీల్‌ మేకర్‌ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం,  మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి, శెనగపిండి, ఉల్లిపాయ తరుగు, నిమ్మరసం అన్ని వేసుకుని కాస్త నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. 


ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌ షేప్‌లో చేసుకుని మరుగుతున్న నూనెలో వేసుకుని దోరగా వేయించుకోవాలి. అంతే క‌ర‌క‌ర‌లాడే మీల్‌ మేకర్‌ పకోడీ రెడీ..  మీల్ మేకర్ లో ప్రోటీనలు అధికంగా ఉండే ఒక ఆహార పదార్థం. వీటితో వంటకాలు చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: