కావాల్సిన పదార్థాలు: 
క్యాలీఫ్లవర్- ఒక‌టి
గుడ్లు- మూడు
ఉల్లిపాయ- రెండు
కొత్తిమీర- కట్ట


ఆవాలు- అరటేబుల్‌ స్పూను
మినపప్పు- అరటేబుల్‌స్పూను 
జీలకర్ర- అరటేబుల్‌స్పూను
కారం- 4 టేబుల్‌ స్పూన్లు


ఉప్పు- రుచికి తగినంత 
పసుపు- చిటికెడు
నూనె-సరిపడా 
కరివేపాకు- రెండు రెమ్మలు


తయారీ విధానం: ముందుగా క్యాలీఫ్లవర్‌ను చిన్నగా కట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత స్టౌ మీద పాన్‌లో పోపు తాలింపు పెట్టుకోవాలి. అందులో క్యాలీఫ్లవర్‌ వేసి ఉప్పు, పసుపు, కారం వేసి నూనెలో బాగా మగ్గనివ్వాలి. 


ఆ తర్వాత కొద్దిగా నీరు పోసి ఉడుకుతుండగా గుడ్లు కొట్టి వెయ్యాలి. ఆ తర్వాత బాగా నూనెలో వేయించి దించుకునే ముందు కొత్తిమీర వేసుకుని స్టౌ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ టేస్టీ క్యాలీఫ్లవర్‌ ఎగ్‌ ఫ్రై రెడీ. ఎగ్‌లో ప్రోటీన్లు అధికం. 


ఇక‌ క్యాలీ ఫ్లవర్లో ఆరోగ్యాన్ని పెంచే ఎన్నో గుణాలున్నాయి. ఇందులో విటమిన్ బి సమృద్ధిగా లభిస్తుంది. పోషకాలు ఎక్కువ గానూ, క్యాలరీలు తక్కువగానూ క్యాలీఫ్ల‌వ‌ర్‌లో ఉన్నాయి. ఈ రెండిటి కాంబినేష‌న్‌లో క్యాలీఫ్లవర్‌ ఎగ్‌ ఫ్రై తిన‌డం చాలా మందిచి.


మరింత సమాచారం తెలుసుకోండి: