కావాల్సిన ప‌దార్ధాలు:
చికెన్‌ - 500 గ్రా
ఉల్లిపాయలు - 2
పచ్చిమిరపకాయలు - 3
పసుపు - 1/4 స్పూను
ధనియాలు - 1 స్పూన్‌ 


దాల్చిన చెక్క : 3
అల్లం పేస్ట్‌ - 1 స్పూను
ఉప్పు - 1 స్పూను
కారం - 1 స్పూను 
నిమ్మకాయ - 1


కొబ్బరి పొడి - 1 స్పూను 
నీళ్ళు - సరిపడా
కొత్తిమీర - 1/4 కప్పు
నూనె : సరిపడా


తయారీ విధానం: 
ముందుగా చికెన్‌ ముక్కల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దానిలో పసుపు వేసిన మజ్జిగలో ఐదు నిమిషాలు పాటు నానబెట్టాలి. ఇప్పుడు చికెన్‌లో పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు, నిమ్మకాయ వేసి కలిపి క‌నీసం రెండు గంటల పాటు నానబెట్టాలి. ఇప్పుడు ఒక పెనంలో ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, వేసి ఫ్రై చేయాలి.


ఆ తర్వాత కొబ్బరిపొడి వేసి వేయించాలి. తర్వాత వాటిని మిక్సీలో వేసి పొడి పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌ తీసుకుని నూనె వేసి వేడి అయ్యాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, తర్వాత దానిలోనే పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. 


తర్వాత నానబెట్టుకున్న చికెన్‌ వేసి ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్‌ మీద కాసేపు ఉడికించాలి. తర్వాత మసాలా, వేసి అరలీటరు నీళ్ళు పోసి ఉడికించాలి. చివరిగా కొత్తిమీర వేస్తే స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే ఎంతో రుచిక‌ర‌మైన నాటుకోడి పులుసు రెడీ.. దీన్ని రైస్‌తో లేదా రోటీతో తింటే చాలా బాగుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: