కావాల్సిన‌ పదార్థాలు: 
బీట్‌రూట్‌ ముక్కలు - ఒక కప్పు,
పచ్చికొబ్బరి తురుము - పావుకప్పు
నువ్వుల నూనె - ఒక టీ స్పూను
ఉప్పు - రుచికి సరిపడా


ధనియాలు - ఒక టీ స్పూను
ఎండుమిర్చి - 4
నువ్వులు - ఒక టీ స్పూను
మినప్పప్పు - ఒక టేబుల్‌ స్పూను 


తయారీ విధానం : 
ముందుగా బీట్‌రూట్‌ ముక్కల్ని ఆవిరిపై ఉడికించాలి. ఇప్పుడు నూనెలో ఉడికించిన‌ బీట్‌రూట్‌ ముక్కల్ని వేసి తడి పొయ్యేవరకు వేగించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో పప్పులు, మిర్చి, ధనియాలు నూనెలో దోరగా వేగించాలి. 


ఆ తర్వాత బీట్‌రూట్‌ ముక్కలు, కొబ్బరి తురుము, తాలింపు దినుసులు, ఉప్పు .. అన్నీ కలిపి బరకగా రుబ్బుకోవాలి. అంటే టేస్టీ టేస్టీ బీట్‌రూట్ చ‌ట్నీ రెడీ. దీన్ని రైస్ లేదా ప‌రోటాతో తింటే బాగుంటుంది. బీట్‌రూట్‌లో పోష‌కాలు మెండుగా ఉంటాయి. 

బీట్‌రూట్ ర‌క్త‌పోటు నివార‌ణ‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌రియు జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్‌ తోడ్పడుతుంది. మ‌న శ‌రీరానికి కావాల్సి ఎన్నో పోష‌కాలు బీట్‌రూట్‌లో ఉన్నాయి. దీన్ని ప‌చ్చ‌డి చేసుకుని తిన‌డం ఆరోగ్యానికి చాలా మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: