కావాల్సిన ప‌దార్ధాలు:
బంగాళదుంపలు- అర కెేజి
 మెంతులు- అర టీస్పూను
మెంతి ఆకుల కట్టలు- 2
ధనియాల పొడి- ఒక టీస్పూను


కారం- ఒక టీ స్పూను
ఉప్పు-తగినంత
ఎండుమిర్చి- 3
నూనె- అరకప్పు


తయారీ విధానం:
ముందుగా కడాయి వేడి చేసి అరకప్పు నూనె వేసి క‌ట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి బ్రౌన్‌ కలర్‌లోకి మారేంతవరకు వేయించుకోవాలి. మగ్గిన తర్వాత వీటిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు కడాయిలో టీ స్పూను నూనె వేసి వేడెక్కిన తర్వాత మెంతులు, ఎండుమిర్చి వేయాలి.


ఆ తర్వాత మెంతి ఆకులు వేసి పచ్చి వాసన పోయే దాకా వేయించుకోవాలి. దీంట్లో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ధనియాల పొడి, కారం, ఉప్పు తగినంత వేసుకుని బాగా కలపాలి. దుంపలకు ఉప్పు, కారం బాగా పట్టాక తక్కువ మంట మీద ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ముక్కలు ఉడికి నూనె పైకి తేలాక స్టౌ ఆఫ్ చేయాలి. అంతే ఆరోగ్యానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డే ఆలూ మెంతి కూర రెడీ..!



మరింత సమాచారం తెలుసుకోండి: