కావాల్సిన ప‌దార్థాలు:
చేపలు- కిలో
టమాటలు- 4
ఉల్లిపాయలు- 3


పచ్చిమిరపకాయలు- 2
కారం- 2 టేబుల్‌స్పూన్లు
పసుపు- చిటికెడు


ఉప్పు-తగినంత
నూనె-సరిపడా
అల్లంవెల్లుల్లి పేస్ట్- 2 టేబుల్‌స్పూన్స్‌


గరంమసాలా- 1 టేబుల్‌స్పూన్
జీలకర్ర- 1 టేబుల్‌స్పూన్‌
ధనియాలు- 2 టేబుల్‌స్పూన్లు


కరివేపాకు- 2 రెబ్బలు
చింతపండు- 30గ్రా
కొత్తిమీర- కొద్దిగా


తయారీ విధానం:
ముందుగా చేపల్ని శుభ్రం చేసుకుని నచ్చిన సైజులో ముక్కలు కట్‌చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చింతపండుని  నీళ్లలో నానబెట్టుకోవాలి. మిక్సీలో ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ త‌ర్వాత స్టౌ మీద గిన్నె పెట్టి సరిపడా నూనెపోసి బాగా కాగాక కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ పేస్ట్‌ వేసి వేగించాలి. ఉల్లి బాగా వేగిన తర్వాత ఉప్పు , పసుపు, కారం, గరంమసాలా వేసి బాగా కలపాలి.


ఇప్పుడు చేపముక్కల్ని కూడా వేసి కాసేపు మగ్గనివ్వాలి. మధ్యమధ్యలో చేపముక్కల్ని తిరగేస్తూ ఉండాలి. చేప ముక్కలు కొంచెం వేగాక అందులో చింతపండు పులుసు వేసి బాగా మరగనివ్వాలి. ఓ పావు గంటసేపు స్లో ఫ్లేమ్‌పై పులుసు మరిగిన తర్వాత కొత్తిమీర తురుము వేసి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో సులువుగా చేప‌ల పులుసు రెడీ..!



మరింత సమాచారం తెలుసుకోండి: