కావాల్సిన పదార్థాలు:
క్యాలీఫ్లవర్- చిన్నది
బంగాళాదుంపలు- 3
కొత్తిమీర- కొద్దిగా
నూనె- 4 టేబుల్ స్పూన్లు
మినపప్పు- టేబుల్ స్పూను
మెంతులు- అర టీస్పూను
పసుపు- చిటికెడు
ఉప్పు- రుచికి సరిపడా
ఎండుమిరపకాయలు- 4
కొబ్బరి పొడి- అరకప్పు
ఇంగువ- చిటికెడు
ధనియాలు- టేబుల్ స్పూను
ఆవాలు- అర టీ స్పూను
కరివేపాకు- కొద్దిగా
ఉల్లిపాయ- 2
చింతపండు గుజ్జు- టేబుల్ స్పూను
తయారీ విధానం:
ముందుగా బాండీలో కొద్దిగా నూనె వేసి ధనియాలు, మెంతులు, ఎండు మిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత దీంట్లో కొబ్బరి పొడి కూడా వేసి మెత్తగా పొడి చేసుకుని పెట్టుకోవాలి. బంగాళాదుంపలు ముక్కలుగా చేసుకుని ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో మరికొద్దిగా నూనె వేసి కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంగువ వేసి వేయించుకోవాలి.
ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా వేయించుకున్న తరువాత ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు, క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి కొద్దిగానీరు, చింతపండు గుజ్జు వేసి ఉడికించాలి. ముక్కలు బాగా వేగిన తరువాత మసాలా పొడి, కొత్తిమీర వేసి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే రుచికరమైన బంగాళాదుంప క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ..!