కావాల్సిన ప‌దార్ధాలు:
బంగాళదుంపలు- 2
ఉల్లిపాయ- 1
అల్లం వెల్లుల్లి పేస్ట్‌- 1 స్పూను
ఉప్పు- రుచికి సరిపడా
మసాలాలు- కొద్దిగా


టమోట- 1
పచ్చిమిర్చి- 3
నీళ్లు- 2 కప్పులు
కొత్తిమీర- కొద్దిగా


యాలకులు- 3
దాల్చిన చెక్క- 2
లవంగాలు- 3
ఎండుమిర్చి- 2


తయారీ విధానం:
ముందుగా కుక్కర్‌లో కొద్దిగా నూనె వేసి చేయాలి. నూనె వేడయ్యాక అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేగించుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే సన్నగా తరిగిన టమోట ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు, మసాలా దినుసులు వేసి 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.


ఇప్పుడు బంగాళదుంప ముక్కలు మరియు ఎండుమిర్చి కూడా వేసి స్లో ఫ్లేమ్‌ మీద ఫ్రై చేసుకోవాలి. పోపు మొత్తం వేగిన తర్వాత అందులో కడిగిపెట్టుకొన్న బియ్య, సరిపడా నీళ్ళు పోసి 4 విజిల్స్‌ వచ్చే వరకూ మూత పెట్టి ఉడికించుకోవాలి. విజిల్‌ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్‌ చేసి ఆవిరి మొత్తం తగ్గిన తర్వాత మూత తీసి కొత్తిమీర చ‌ల్లితే స‌రిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ పొటాటో రైస్ రెడీ..!


మరింత సమాచారం తెలుసుకోండి: