కావాల్సిన పదార్థాలు:
ఓట్స్‌- 1కప్పు
చిన్న బన్నులు- 4
బంగాళా దుంపలు- 2


చీజ్‌- 1/4కప్పు
ఉల్లిపాయ- 1
టమాటా- 1
నూనె- తగినంత


పచ్చిమిర్చి- 2
గరంమసాలా పొడి- 1/2 టేబుల్‌ స్పూన్‌
మిరియాల పొడి- చిటికెడు


తయారీ విధానం:
ముందుగా బంగాళాదుంపలను మెత్తగా ఉడికించుకోవాలి. ఒక బౌల్‌లో కప్పుడు నీళ్ళు మరిగించిన ఓట్స్‌ వేసి 10 నిమిషాలు నాననివ్వాలి. ఒక గిన్నెలో ఉడికించిన బంగాళాదుంపలు చెక్కుతీసి పొడిపొడిగా చేసుకోవాలి. నానిన ఓట్స్‌ నుంచి నీరు పిండేయాలి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి తగినంత ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా పొడి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొన్ని వేసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుని వెడల్పుగా చేసి వేడి పెనం మీద కొద్దిగా నూనె వేస్తూ ఎర్రగా టిక్కీలా కాల్చుకోవాలి.


బన్నుని మధ్యలోకి సగంలో కోసి ఒక వరుసలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు పెట్టి దానిపై ఈ టిక్కీ పెట్టి పైన చీజ్‌ తురుము వేసి ఇంకో బన్ను ముక్కపెట్టి కొద్దిగా వత్తాలి దానిని ఓవెన్‌లో గానీ లేదా పెనంపైగానీ ఉంచి స్లో ఫ్లేమ్‌పై చీజ్‌ కరిగే వరకు వేడిచేయాలి. అంతే ఎంతో టేస్టీ టేస్టీ  ఓట్స్‌ మినీ బర్గర్ రెడీ..!  



మరింత సమాచారం తెలుసుకోండి: