కావాల్సిన ప‌దార్థాలు:
బీరకాయ ముక్కలు- రెండు కప్పులు
కోడిగుడ్లు- నాలుగు


గరం మసాలా పొడి- ఒక టీస్పూన్‌
నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు
ఉల్లి తరుగు- ముప్పావుకప్పు


అల్లంవెల్లుల్లి పేస్ట్‌- ఒక టీస్పూన్‌
పసుపు- కొంచెం
ఉప్పు- రుచికి సరిపడా
కారం- ఒక టీస్పూన్‌


కరివేపాకు- కొద్దిగా
పచ్చిమిర్చి- 2
ఆవాలు- పావు టీస్పూన్‌
జీలకర్ర- అర టీస్పూన్‌


తయారీ విధానం:
ముందుగా పాన్‌లో నూనె వేడి చేసి కరివేపాకులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేగించాలి. అవి చిటపటమంటున్నప్పుడు ఉల్లి తరుగు వేసి ఉప్పు చల్లి ఉల్లిపాయ‌ ముక్కలు రంగుమారేవరకు ఉంచాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చి వాసన పోయేవరకు వేగించాలి. తరువాత బీరకాయ ముక్కలు వేసి ఉప్పు, పసుపు వేయాలి. మంట పెంచి మూడు నిమిషాలు వేగించాలి.


మూతపెట్టి స్లో ఫ్లేమ్‌ మీద బీరకాయ ముక్కల్ని ఉడికించాలి.  అలాగే మ‌రో పాన్‌లో నూనె వేసి గుడ్లు వేగించి ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిన బీర‌కాయ ముక్క‌ల్లో వేగించిన గుడ్లు, కారం, మసాలాలు వేసి బాగా కలిపి స్లో ఫ్లేమ్‌పై ఉడికించి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే బీర‌కాయ ఎగ్ క‌ర్రీ రెడీ..!  


మరింత సమాచారం తెలుసుకోండి: