వంకాయలు అంటేనే గుత్తివంకాయ కూర గుర్తుకు వచ్చేస్తుంది.ఇక ఈ వంకాయలను తరచూ తినడం వల్ల శరీర కొలెస్ట్రాల్ శాతం తగ్గుముఖం పట్టడమే కాకుండా మధుమేహం అదుపులోకి వస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.అదేవిధంగా శరీర అధిక బరువును తగ్గించేందుకు కూడా వంకాయలు మేలు చేస్తాయి. క్యాన్సర్ వంటి ప్రమాకరమైన వ్యాధుల బారి నుంచి రక్షించే గుణాలు వంకాయల్లో పుష్కలంగా వున్నాయి.వంకాయల్లో పాస్ఫరస్,కాల్షియం,విటమిన్ బి1,బి2,బి3,బి6,ప్రోటీన్లు, పొటాషియం,జింక్,విటమిన్ సి, ఐరన్,మెగ్నిషియం,ఫోలేట్,విటమిన్ కె తదితర పోషకాలు ఇందులో ఉన్నాయి.



ఇక ఆంధ్రాస్పెషల్ అనగానే ఎవరైనా చెప్పేది గుత్తివంకాయ అని.ఈ గుత్తివంకాయ కూరను చాలా మంది చాలా రకాలుగా చేస్తారు.కాని ఈ కూర చాలా పాతకాలం నాటి రెసిపి.అప్పట్లో ఇన్ని రకాల మసాలాలు వేసి వండేవారు కాదు.అయినా ఆ కూరే చాలా రుచిగా ఉండేది.వంకాయ తొడిమ పట్టుకుని కోరుక్కుని తినేయవచ్చు.ఈ కూర కొంచం డ్రైగానే ఉంటుంది.గుత్తివంకాయ కూర అంటేనే నూనె, ఉప్పు, కారం అన్ని ఎక్కువే పడతాయి.కాబట్టి ఇది తినాలనుకున్న రోజు నో డైట్.ఇక ఈ కర్రీ ఎలా తయారు చేస్తారో చూద్దాం.



కావలసిన పదార్ధాలు:: 
గుత్తివంకాయలు1/2కేజీ.. నూనె 7 స్పూన్స్... ఉప్పు,కారం రుచికిసరిపడ... ధనియాలు 3స్పూన్స్... వెల్లుల్లి రెబ్బలు10... జీర 2స్పూన్స్...మినపప్పు 3స్పూన్స్...వేయించిన శెనగపప్పు 1/2కప్పు...పసుపు చిటికెడు...ఎండుకొబ్బరి తురుము 3స్పూన్స్... మెంతులు 4...చింతపండుపులుపుకు సరిపడ...పసుపు చిటికెడు...కరివేపాకు 2రెమ్మలు... కొత్తిమీరతరుగు కొంచం.. 



తయారీ విధానం::
స్టౌ మీద కడాయి పెట్టి అందులో ధనియాలు,జీర,మినపప్పులను,మెంతులు వేసి బాగా వేయించుకోవాలి.అవి సగానికి పైగా వేగాక అందులో కరివేపాకు,వెల్లుల్లి రెబ్బలు వేసి మరి కాసేపు వేయించుకుని చల్లార్చుకోవాలి.వీటిని మిక్సీ జార్ లో వేసి, అందులోనే రుచికి సరిపడ ఉప్పు,కారం,చిటికెడు పసుపు,వేయించిన శెనగపప్పు,ఎండుకొబ్బరి వేసి మెత్తగా పొడిలా చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకోవాలి.చింతపండును నీళ్ళలో నానపెట్టుకోవాలి.ఇప్పుడు వంకాయలను శుభ్రంగా కడిగి ప్లస్ ఆకారంలో గుత్తిలా కోసుకోవాలి. తొడిమ తీయకూడదు.ఇప్పుడు ఒక్కో వంకాయలో చేసుకున్న పొడిని కూరి గట్టిగా వత్తుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టౌ మీద వెడల్పాటి నాన్‌స్టిక్ పెనంపెట్టి నూనె వేసి కూరిన వంకాయలను పరిచి పైన చిటికెడు ఉప్పు చల్లి మూత పెట్టి మగ్గనివ్వాలి.అవి సగానికి పైగా మగ్గాక అందులో చింతపండు రసం వేసి కలిపి మరలా మూత పెట్టి మగ్గించాలి.వంకాయ ముక్క పూర్తిగా ఉడికాక పైన మిగిలిన పొడిని వేసి కలిపి ఒక ప్లేట్ లోకి తీసుకుని పైన కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి ఇక ఈ కర్రీని తిన్న వారెవ్వరు మిమ్మల్ని ఎప్పటికి మరవలేరు..

మరింత సమాచారం తెలుసుకోండి: