కావాల్సిన ప‌దార్థాలు:
పచ్చిబఠాణీ- పావుకప్పు
ఎగ్స్- 3
టమాటాలు- 2
కారం- ఒక టేబుల్‌స్పూన్‌


అల్లంవెల్లుల్లి పేస్టు- 1 టేబుల్‌స్పూన్‌
ధనియాలపొడి- అర టేబుల్‌స్పూన్‌
గరమసాలా- అర టేబుల్‌స్పూన్‌
పసుపు- చిటికెడు


ఉప్పు- రుచికి స‌రిప‌డా
నూనె- స‌రిప‌డా
కొత్తిమీర- కొద్దిగా


లవంగాలు- 4
ఉల్లిపాయ- 2
దాల్చినచెక్క- 2


తయారీ విధానం :
ముందుగా స్టౌ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నూనెవేసి లవంగాలు, దాల్చిన చెక్క, ఉల్లిపాయతరుగు, అల్లంవెల్లుల్లి పేస్టు ఒకదాని తర్వాత ఒకటి వేయించి పసుపు, క‌ట్ చేసిన టమాట ముక్కలు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. తర్వాత ధనియాలపొడి, మసాలాపొడి, పచ్చిబఠాణీ వేసి మూతపెట్టి స్లో ఫ్లేమ్ మీద‌ ఉడికించాలి.


బఠాణీ ఉడికాక‌ గుడ్లని పగలకొట్టివేయాలి. ఇప్పుడు బాగా క‌లిపి మూతపెట్టి స్లో ఫ్లేమ్ మీద‌ 10నిమిషాలు మ‌గ్గ‌నివ్వాలి. దించేముందు కొత్తిమీర చల్లుకోవాలి. అంతే రుచిక‌ర‌మైన ఎగ్ బఠానీ క‌ర్రీ రెడీ.. అన్నం లేదా పరాటాలతో ఈ కూర కాంబినేష‌న్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎగ్‌, బ‌ఠానీ రెండు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: