కావాల్సిన పదార్థాలు:
మైదా- 1కప్పు
నూనె- వేగించడానికి సరిపడా
ఉప్పు- రుచికి సరిపడా


టొమాటో సాస్‌- కొద్దిగా
కోడిగుడ్లు- 2
ఉల్లిపాయ- 1(సన్నగా తరిగి)
కీర దోసకాయ- 1(సన్నగా త‌రిగి)


పచ్చిమిర్చి- 2(సన్నగా తరిగి)
నీళ్లు- త‌గినంత‌
నిమ్మ‌ర‌సం- కొద్దిగా


తయారీ విధానం:
ముందుగా మైదాపిండిలో నీళ్లుపోసి ముద్దలా కలిపి పరాఠాలు చేయాలి. తర్వాత ఒక గిన్నెలో కొడిగుడ్డును పగ‌లు కొట్టి దానిలో చిటికెడు ఉప్పు కలపాలి. తర్వాత పాన్‌లో టేబుల్‌ స్పూన్‌ నూనె వేడి చేసి అందులో కోడిగుడ్డు మిశ్రమం వేసి పరాఠా ఎంత సైజులో ఉంటే ఆ సైజులో వచ్చే విధంగా ఆమ్లెట్‌ వేయాలి. 


ఆమ్లెట్‌ సగం ఉడికిన తర్వాత పరాఠాను దానిమీద పెట్టి రెండు నిమిషాలపాటు ఉడికించాలి. తరువాత పరాఠాను తిప్పి కాసేపు ఉంచి బయటకు తీయాలి. ఆమ్లెట్‌ ఉన్నవైపు పైకి ఉంచి అందులో కీర దోసకాయ, పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వాటిపైన టొమాటో సాస్‌ వేసి రోల్‌ చేయాలి. దానిపైన నిమ్మరసం చల్లుకుంటే స‌రిపోతుంది. అంతే రుచిక‌ర‌మైన ఎగ్‌రోల్స్ రెడీ..!


మరింత సమాచారం తెలుసుకోండి: