కావాల్సిన పదార్థాలు:
బోన్‌లెస్‌ చికెన్‌- అరకిలో
మైదాపిండి- ఒకటిన్నర స్పూను
ధనియాల పొడి- టేబుల్‌ స్పూను


మిరియాల పొడి- టేబుల్‌ స్పూను
మొక్కజొన్న పిండి- 2 టేబుల్‌ స్పూన్లు
అల్లం వెల్లుల్లి ముక్కలు- 2 టేబుల్‌ స్పూన్లు
జీలకర్ర పొడి- టేబుల్‌ స్పూను


టమోటా కెచప్‌- అర కప్పు
పచ్చిమిర్చి- 2 టేబుల్‌ స్పూన్లు
కారం- సరిపడ


గుడ్డు- 1
ఉప్పు- రుచికి సరిపడ
నూనె- తగినంత
నీళ్ళు- కప్పు


తయారీ విధానం:
ముందుగా చికెన్‌ ముక్కలకు గుడ్డుసొన, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరంమసాలా పొడి, మొక్కజొన్న పిండి, మైదాపిండి, కారం వేసి బాగా కలిపి పక్కన పెట్టు కోవాలి. ఈ ముక్కలను ఓ గంట పాటు నాననిచ్చి అనంతరం వాటిని నూనెలో ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి.


అదే నూనెలో అల్లంవెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేగిన తరువాత టమోటా కెచప్‌, వేయించిన చికెన్‌ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నీరు చల్లి కొద్దిసేపు వేయించి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ చిల్లి చికెన్‌ బిట్స్ రెడీ..!


మరింత సమాచారం తెలుసుకోండి: