కావాల్సిన ప‌దార్థాలు:
బెండకాయలు - పావు కిలో
ఉల్లిపాయ గుజ్జు - అరకప్పు
ఉప్పు -రుచికి తగినంత


నూనె - 2 టేబుల్‌ స్పూన్లు
టమోటా ముక్కలు - 1 కప్పు
పసుపు - చిటికెడు


కారం- 1 టీ స్పూను
ధనియాలపొడి - 1 టీ
మసాల పొడి - పావు టీ స్పూను


తయారీ విధానం :
ముందుగా బెండ‌కాయ‌ల్ని శుభ్రం చేసుకోవాలి. ఆ త‌ర్వాత‌ బెండకాయల్ని నిలువుగా రెండుముక్కలు చీల్చి ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక టేబుల్‌ స్పూను నూనె వేసి.. వేడి అయ్యాక అందులో ముందుగా క‌ట్ చేసి పెట్టుకున్న బెండ‌కాయ‌ల్ని వేసి పచ్చిదనం పోయేవరకు వేగించి పక్కనుంచాలి.


అదే పాన్‌లో మిగతా నూనె వేసి ఉల్లి గుజ్జుతో పాటు ఉప్పు వేసి స్లో ఫ్లేమ్‌పై దోరగా వేగించాలి. తర్వాత టమోటా తరుగు వేసి మ‌గ్గ‌నివ్వాలి. ఇవి మెత్తబడ్డాక బెండ ముక్కలు, పసుపు, కారం, ధనియాలపొడి వేసి, మూత పెట్టి చిన్నమంటపై ఉంచాలి. ఐదు నిమిషాల తర్వాత మసాల పొడి చల్లి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే రుచిక‌ర‌మైన బెండ‌కాయ మ‌సాలా క‌ర్రీ రెడీ..!


మరింత సమాచారం తెలుసుకోండి: