కావాల్సిన ప‌దార్థాలు:
కిస్‌మిస్- 50 గ్రాములు
క‌ర్బూజాపండ్లు- 120 గ్రాములు
పంచదార-100 గ్రాములు


బెర్రీస్‌- 25 గ్రా
వెన్న- 100 గ్రా
కండెన్స్‌డ్‌ పాలు- 1/2 చెంచా
లవంగాలు- 1/4 చెంచా


జాజికాయ పొడి- 1/4 చెంచా
తేనె- 1స్పూన్‌
నీరు- 3/4 కప్పు
బేకింగ్‌ పౌడరు-1 స్పూన్‌


యాలకుల పొడి-1/4 స్పూన్‌
ఉప్పు- పావు చెంచా
బాదంపప్పు- 25 గ్రాములు


తయారీ విధానం: 
ముందుగా ఒక గిన్నెలో వెన్న, పంచదారను కలిపి పాకంలాగా తయారు చేసుకోవాలి. తరువాత మరొక గిన్నెలో చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న కర్బూజాపండ్లు, తేనె, నీళ్ళని కలిపి గ్యాస్‌ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత దించుకుని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. తర్వాత ఇంకొక గిన్నెను తీసుకుని అందులో ఉడికిన పండు, మైదాపిండి, పంచదార మిశ్రమం, ఉప్పు, వెన్న, కండెన్స్‌డ్‌ మిల్క్‌, బేకింగ్‌ పౌడర్‌, యాలకుల పొడి, జాజికాయ పొడి దంచుకున్న లవంగాలు వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. 


తరువాత 12 సెం.మీ ఉన్న కేక్‌ డబ్బా లేదా టిన్‌లో బ్రౌన్‌ పేపర్‌ వేసి దానిపై సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని వేసి అవెన్లో 350 డిగ్రీల ఫారన్‌హీట్‌ మీద ఉడకనివ్వాలి. ఆ త‌ర్వాత బ‌య‌ట‌కు తీసి గంట చ‌ల్లారిస్తే స‌రిపోతుంది. అంతే య‌మ్మీ య‌మ్మీ ఫ్రూట్స్ కేక్ రెడీ..!


మరింత సమాచారం తెలుసుకోండి: