కావాల్సిన ప‌దార్థాలు:
బాస్మతి రైస్‌- 2 కప్పులు
పనీర్‌- 200 గ్రాములు
పచ్చిబఠాణీలు- 1/2 కప్పు
ఉల్లిపాయలు- 1


అల్లం వెల్లుల్లి పేస్ట్‌- 1 టేబుల్‌ స్పూన్‌
పచ్చిమిర్చి తరుగు- 3 టుబుల్‌ స్పూన్లు
నెయ్యి- టేబుల్‌ స్పూన్‌
నూనె- 3 టేబుల్‌ స్పూన్లు


పలావు ఆకు-1
యాలకులు-2
లవంగాలు-2
జీలకర్ర- 1 టీ స్పూన్‌


జీడిపప్పులు- 5
ఉప్పు- రుచికి తగినంత
కొత్తిమీర తరుగు-1 కప్పు
దాల్చిన చెక్క-అంగుళం ముక్క


త‌యారీ విధానం:
బియ్యం శుభ్రంగా కడిగి పదినిమిషాలు నానబెట్టాలి. తర్వాత స్టౌపై పాన్‌ పెట్టి నెయ్యివేసి వేడెక్కిన తర్వాత పనీర్‌ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించిన పనీర్‌ ముక్కల్ని ఒక ప్లేట్‌లోకి తీసి పక్కనపెట్టుకోవాలి. అదే పాన్‌లో నూనె వేసి కాగాక జీలకర్ర, దాల్చిన చెక్క, పలావు ఆకు, యాలకులు, లవంగాలు వేసి వేగాక అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి, బఠాణీ వేసి వేయించుకోవాలి. 


ఆ తర్వాత బియ్యం, ఉప్పు మూడున్నర కప్పుల నీరుపోసి ఉడికించుకోవాలి. అన్నం దగ్గరపడుతుండగా వేయించి పెట్టుకున్న పనీర్‌, జీడిపప్పు ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి కలిపి రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్‌ చేయాలి. అంతే ఎంతో రుచిక‌ర‌మైన ప‌నీర్ బిర్యాని రెడీ..!  


మరింత సమాచారం తెలుసుకోండి: