కావాల్సిన పదార్ధాలు:
తురిమిన పనీర్‌- 1 కప్పు
ఉడికించిన బంగాళా దుంప-1
సన్నగా తరిగిన పచ్చిమిర్చి- 3
కారం- 1 టీ స్పూను


నూనె- సరిపడా
ఛాట్‌ మసాలా- 1/2 టీ స్పూను
ఉప్పు- రుచికి తగినంత
ఉడికించిన బంగాళా దుంప- 1
బ్రెడ్‌ స్టైస్‌లు- 8 


బ్రెడ్‌ ముక్కలు- 1/2 కప్పు
కొత్తిమీర తరుగు- 2 టేబుల్‌ స్పూన్లు
తురిమిన చీజ్‌- 3 టేబుల్‌ స్పూన్లు


తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్‌లో బ్రెడ్‌ స్లైస్‌లు తప్ప మిగిలిన పదార్ధాలన్నీ వేసి బాగా కలిపి ఉండల్లా తయారు చెయ్యాలి. తర్వాత బ్రెడ్‌ స్లైసులను తీసుకుని చివర్లు కత్తిరించాలి. చపాతీ కర్రతో బ్రెడ్‌ స్లైసులను చపాతీల్లాగ వత్తుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారుచేసి పెట్టుకున్న ఉండల్ని ఒక్కో బ్రెడ్‌ స్లైస్‌పై పెట్టి మరలా వత్తాలి. అన్నీ వ‌త్తుకుని.. వీటిని మూడు లేదా నాలుగు ముక్కలుగా కోసి లోపల ఉంచిన మిశ్రమం విడిపోకుండా ఒక టూత్‌ పిక్‌ను గుచ్చాలి. 


ఇప్పుడు ప్యాన్‌ పెట్టి నూనె వేసి వేడెక్కేక అందులో ముక్కలుగా కట్‌చేసి పెట్టుకున్న బ్రెడ్‌ స్లైసులను వేసి ఒక్కొక్కొటిగా వేయించుకోవాలి. అంతే క్రిస్పీ క్రిస్పీ ప‌నీర్ ప‌కోరా రెడీ.. వీటితో చట్నీ లేదా సాస్‌తో తింటే చాలా బాగుంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: