ఇప్పుడు క్రికెట్ లో ఆఫ్గనిస్తాన్ పసికూన.  ఆడిన 8 మ్యాచ్ లలో ఓటమి పాలైనా.. వీరోచిత ప్రదర్శనను ప్రదర్శించింది.  మెప్పించింది.  ప్రతి మ్యాచ్ లో ప్రత్యర్థిని ఓడించేంత పని చేస్తున్నా.. చివర్లో మాత్రం చేతులెత్తేస్తుంది.  అయితేనేం.. ప్రదర్శన మాత్రం అద్భుతంగా ఉన్నది.  


ఇండియా, పాకిస్తాన్ లతో జరిగిన మ్యాచ్ లలో ఆఫ్గనిస్తాన్ ప్రదర్శన అమోఘం అని చెప్పాలి.  నిన్న పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు ఆటతీరు మాత్రముగ్దుల్ని చేసింది.  బ్యాటింగ్ లోను, బౌలింగ్ లోను సమిష్టిగా రాణించినా.. చివర్లో పేస్ బౌలర్ చేసిన తప్పిదాల వలన జట్టు పరాజయం పాలైంది.  


చివరి ఓవర్ వరకు మ్యాచ్ ను తీసుకు రావడం విశేషం.  ఒకానొక దశలో పాక్ ఓడిపోతుంది అనుకున్నారు.  ఆఫ్ఘన్ ప్రదర్శన ఆ రీతిలో ఉన్నది.  వీరోచితంగా పోరాడింది.  ఇదే విధమైన ఆటతీరును భవిష్యత్తులో ప్రదర్శిస్తే.. మరో పెద్ద జట్టుగా మారుతుంది అనడంలో సందేహం అవసరం లేదు.  


ఆఫ్ఘన్ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు.  బీసీసీఐ సపోర్ట్ చేస్తుండటంతో భవిష్యత్తులో జట్టు మరింతగా రాటుతేలుతుందని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు.  భారత ప్రఖ్యాత కంపెనీ అమూల్ సంస్థ ఆఫ్ఘన్ కు స్పాన్సర్ గా నిలవడం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: