ఒక్కోసారి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. సెంటిమెంట్ వర్కౌట్ కావడం కాదే అదే వర్కౌట్ అవుతుంది.  ఇలాంటి సెంటిమెంట్ సినిమాల్లోనే కాదు స్పోర్ట్స్ లో కూడా ఉంటాయని నిరూపణ జరిగింది.  ఇండియా.. ఇంగ్లాండ్ జట్లమధ్య జరిగిన మ్యాచ్ లో ఇండియా ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్నారు.  ఆ మ్యాచ్ లో ఇండియా ఓటమిపాలైంది.  


ఇంగ్లాండ్ భారీ స్కోర్ సాధించగా... పోరాటం చేసిన ఇండియా 36 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.  జెర్సీ మారడం వలనే ఇండియా ఓడిపోయిందని, జెర్సీ బాగున్నా.. అది మనవాళ్లకు అచ్చిరాలేదని వదంతులు వ్యాపించాయి.  వదంతులు వ్యాపించాయిగాని, మన వాళ్ళ పోరాటాన్ని మాత్రం గుర్తించలేదు.  


జెర్సీ మారినా పోరాటం మారలేదు.  బాగానే ఆడారు.. సరే అన్ని మ్యాచ్ లు గెలుస్తామా చెప్పండి.  అవతల జట్టు బలమైన జట్టు.  దీంతో ఇండియా ఓడిపోయింది.  ఒక్కోసారి అలా జరుగుతుంది.  ఇదే విధంగా పాక్.. బాంగ్లాదేశ్ మ్యాచ్ లో కూడా జరిగింది.  


పాకిస్తాన్ బాంగ్లాదేశ్ మ్యాచ్ లో బాంగ్లాదేశ్ జట్టు రెడ్ కలర్ డ్రెస్ తో మ్యాచ్ ఆడింది.  పాకిస్తాన్ భారీ స్కోర్ చేయగా బాంగ్లాదేశ్ తక్కువ స్కోర్ కే కుదేలయింది.  ప్రతి మ్యాచ్ లోను పోరాట పటిమను చూపించిన బాంగ్లాదేశ్.. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం రాణించలేకపోయింది.  దీనికి జెర్సీనే కారణం అని అంటున్నారు.  ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: