క్రికెట్ లో ఏదైనా జరగొచ్చు.  క్రికెట్ మరింత రసవత్తరంగా మారాలి అంటే దానికి తగిన కామెంట్రీ ఉండాలి. కామెంట్రీ లేకుండా క్రికెట్ చూడలేం.  అందుకే మైదానంలో ఉండి చూసేవాళ్లకంటే టీవీల ముందు కూర్చొని చూసేవాళ్ళే ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు.  ఎక్కువగా ఉత్కంఠతతో ఉంటారు.  కానీ, మైదానంలో ఉండేవాళ్ళకు అవేమి తెలియవు.  ఎవరు ఆడుతున్నారో కూడా స్పష్టంగా కనిపించదు.  కానీ, చూస్తారు అంతే.  
ఇక ఇదిలా ఉంటె,  కామెంటేటర్ గా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి హర్ష. ఇప్పటి నుంచి కాదు.. ఎప్పటి నుంచో హర్ష క్రికెట్ కామెంటేటర్ గా పేరు తెచ్చుకున్నారు.  ఎంతో మంది ఈ ఫిల్డ్ లోకి వస్తుంటారు.. పోతుంటారు కానీ హర్ష మాత్రం ఆ ఫీల్డ్ లోనే ఇంకా ఉన్నారు.  కారణం టాలెంట్.  మాట్లాడటం ఒక్కటే సరిపోదు.  సమయానికి అనుగుణంగా మాట్లాడాలి.  ఆకట్టుకునే విధంగా మాట్లాడగలగాలి.  
అదే టాలెంట్ అంటే.  అదే హర్షకు ఉపయోగం అయ్యింది.  అదే హర్షను నిలబెట్టింది.  అదే హర్షను బెస్ట్ కామెంటేటర్ గా సహకరించింది.  అయితే, తొలిసారిగా ఇండియాలో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ జరిగింది.  ఈ టెస్ట్ మ్యాచ్ లో ఇండియా బాంగ్లాదేశ్ పై చారిత్రాత్మక విజయం సాధించింది.  ఈ టెస్ట్ మ్యాచ్ కోసం మొదటిసారి పింక్ బాల్ ను వినియోగించారు.  డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ లో పింక్ బాల్ వినియోగం ఇదే మొదటిసారి.  
బాల్ ను అంచనా వేయడంలో పొరపాట్లు కావొచ్చు.. పింక్ బాల్ తో వచ్చే ఇబ్బందులు కావొచ్చు.. ఎలా ఉన్నాయో అంచనా వేసేందుకు ఆటగాళ్లను అడుగుదామని హర్ష మరో కామెంటేటర్ మంజ్రేకర్ ను అడిగినపుడు అయన దురుసుగా మాట్లాడాడు.  తాను మైదానంలో క్రికెట్ ఆడానని, వాళ్ళను అడగాల్సిన అవసరం లేదని.. మైదానంలో క్రికెట్ ఆడలేదు కాబట్టి మీకు అవసరం అనిపిస్తే అడగమని మంజ్రేకర్ దురుసుగా చెప్పడంతో నెటిజన్లు ఫైర్ అయ్యారు.  హర్షను సపోర్ట్ చేస్తూ ట్విట్టర్ లో హ్యాష్ మంజ్రేకర్ అని క్రియేట్ చేసి ట్రోల్ చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: