విండీస్ విద్వంసకర బ్యాట్సమెన్ లలో క్రిస్ గేల్ ఒకరు.  క్రీజ్ లో నిలదొక్కుకున్నాడు అంటే సిక్సర్ల వరద కురిపిస్తాడు.  అయితే, స్టాండ్ కావడమే కష్టం.   ఐపీఎల్ లో రాణించిన క్రిస్ గేల్.. వరల్డ్ కప్ విషయంలోకి వచ్చే సరికి ఎందుకు ఆడలేకపోతున్నాడో అర్ధం కావడం లేదు.  


ఈ టోర్నీ తరువాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోబోతున్నట్టు ప్రకటించారు. దీంతో వెస్ట్ ఇండీస్ క్రికెట్ బోర్డు తో పాటు క్రికెట్ అభిమానులు సైతం షాక్ అయ్యారు.  గేల్ తప్పుకుంటే విండీస్ కు పెద్ద తగులుతుందని, నిర్ణయంపై పునరాలోచించాలని పలువురు కోరారు.  


వారి అభ్యర్ధనలు విన్న గేల్.. తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టుగా ప్రకటించాడు.  తన రిటైర్మెంట్ కు మంచి ముగింపు ఉండాలనే ఉద్దేశ్యంతో మరో సిరీస్ ఆడిన తర్వాత రిటైర్మెంట్ ను ప్రకటించబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ప్రపంచ కప్ టోర్నమెంట్ తర్వాత వెస్టిండీస్ లో టీం ఇండియా పర్యటించబోతుంది. ఆగస్టు మరియు సెప్టెంబర్ లలో వెస్టిండీస్ ఇండియాల మద్య టెస్టు సిరీస్ జరుగబోతుంది. ఆ టెస్టు సిరీస్ తర్వాత తాను రిటైర్ అవుతానంటూ గేల్ తాజాగా మీడియాతో మాట్లాడిన సందర్బంగా పేర్కొన్నాడు.


1999లో ఇండియాతో జరిగిన వన్డే మ్యాచ్ తో అరంగేట్రం చేసిన క్రిస్ గేల్ మళ్లీ ఇండియాతో సిరీస్ ఆడి క్రికెట్ కు గుడ్ బై చెప్పాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వన్డేల్లో 10 వేల మైలు రాయి దాటిన గేల్ టెస్టుల్లో 7214 పరుగులు చేశాడు. ఎన్నో అద్బుత ఇన్నింగ్స్ ఆడి జట్టుకు తీపి విజయాలను సిరీస్ లను తెచ్చి పెట్టిన గేల్ లేని లోటు ఆ జట్టుకు ఖచ్చితంగా ఎవరు పూడ్చలేనిది. అయితే, అంతర్జాతీయ మ్యాచ్ లకు దూరంగా ఉన్నా.. తనకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన ఐపీఎల్ మ్యాచ్ లలో ఆడతారా లేదా అన్నది తెలియాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: