ఇండియా.. న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా అర్ధాంతరంగా ఆగింది.  టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బ్లాక్ క్యాప్స్ జట్టుపై భారత బౌలర్లు విరుచుకుపడిన సంగతి తెలిసిందే.  బౌలర్ల ధాటికి 46 ఓవర్లలో న్యూజిలాండ్ కేవలం 211 పరుగులు చేసింది. ఐదు వికెట్లు కోల్పోయింది.  


ఖచ్చింతంగా ఇండియా ఫైనల్స్ కు వెళ్తుందని అనుకున్న సమయంలో ఆకాశం మేఘావృతం కావడం.. వర్షం కురవడంతో ఆట ఆగిపోయింది.  అదనపు సమయం కేటాయించినా వర్షం తగ్గటకపోవడంతో ఈరోజుకు వాయిదా వేశారు.  ఈ రోజైనా మ్యాచ్ జరుగుతుందా అన్నది అనుమానంగా మారింది.  


ఎందుకంటే నేడు కూడా అక్కడ వాతావరణం నిన్నటి పరిస్థితులే ఉండే విధంగా కనిపిస్తున్నాయి.  నిన్నటి నుంచి కురుస్తున్న వర్షం ఇంకా తెరిపించిన దాఖలు లేవు.  ఒకవేళ ఈరోజు వర్షం కురిసి ఆడటం కుదరని పక్షంలో రన్ రేట్ ప్రకారం ఇండియా గెలిచినట్టు ప్రకటిస్తారట.  


ఈరోజు ఆట జరిగితే ఒకరకంగా న్యూజిలాండ్ కు మంచిది అని చెప్పాలి.  పోరాటం చెయ్యొచ్చు.  లేదు వర్షం కురిసి ఆగిపోతే మాత్రం ఆ జట్టుకు వర్షం శాపం అని చెప్పాలి.  ఎందుకంటే లీగ్ దశలో కూడా న్యూజిలాండ్ జట్టు వర్షం కారణంగా ఇండియాతో జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: