తప్పకుండా ఫైనల్స్ కు వెళ్తుంది అనుకున్న ఇండియా సెమిస్ లో వెనక్కి వచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది.  దేనికి రెండు కారణాలు ఉన్నాయి.  ఒకటి ముందురోజు వర్షం పడటం.  వర్షం కారణంగా ఆట మధ్యలోనే ఆపాల్సి వచ్చింది.  రెండో రోజు అట మొదలైనా.. తేమ ఉండటం వలన బంతి స్వింగ్ అయ్యింది.  


ఫలితంగా ఆదిలోనే వరసగా వికెట్లు కోల్పోయింది.  లేదంటే ఫలితం మరోలా ఉండేది. ధోని, జడేజా రాకతో ఆటను తిరిగి తమ చేతుల్లోకి తీసుకున్నారు.  చివరి తీసుకొచ్చారు.  పది బంతుల్లో 25 రన్స్.  అదేమంటే పెద్ద స్కోర్ కాదు.  ధోని ఖచ్చితంగా కొట్టగలడు.  


అదే సమయంలో రెండో రన్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు.  అయితే, ధోని అవుట్ అయిన తీరు చూస్తుంటే అది నో బాల్ అని తెలుస్తోంది.  పవర్ ప్లే సమయంలో ఔటర్ సర్కిల్ లో ఆరుగురు ఫీలర్లు ఉన్నారు.  ఇది రూల్స్ కు విరుద్ధం.  అంపైర్ దాన్ని గమనించి నో బాల్ గా పరిగణిస్తే బాగుండేది.  దొం రన్ తీసేవాడు కాదు.  ఇది వేరే సంగతి అనుకోండి.  


సెమిస్ లో ఓడిన ఇండియా జట్టుకు ప్రైజ్ మనీ కింద 5 కోట్ల రూపాయలకు పైగానే డబ్బు వస్తుందట.  ఈసారి వరల్డ్ కప్ ప్రైజ్ మనీని భారీగా పెంచారు.  గెలిచిన జట్టుకు 25 కోట్లు, ఫైనల్ లో ఓడిన జట్టుకు దాదాపుగా 15 కోట్ల రూపాయల వరకు ప్రైజ్ మనీ వస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: