ఒకప్పుడు సచిన్ లేని ఇండియాను ఊహించుకోవడం కష్టంగా ఉండేది.  ఇప్పుడు ధోని లేని ఇండియాను ఊహించుకోలేరు.  సచిన్ మాస్టర్ కావొచ్చు.. ధోని సూపర్ ఫినిషర్.  ఎన్నోసార్లు తన సూపర్ ఇన్నింగ్స్ తో టీం ఇండియాను గెలిపించారు.  ఎంత ఒత్తిడిలో సైతం అధితమైన విజయాలను ఇండియాకు అందించాడు.  


కానీ, మొన్న వరల్డ్ కప్ సెమిస్ లో కొన్ని తప్పిదాల కారణంగా రన్ అవుట్ అయ్యాడు.  దీంతో ఇండియా 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రనౌట్ అయినపుడు ధోని కళ్ళవెంట నీళ్లు కారాయి.  ఔటైన తరువాత వాస్తు కన్నీళ్లు పెట్టుకోగా.. ఆ దృశ్యాన్ని ఫోటోగా తీస్తున్న ఫోటోగ్రాఫర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  


ఇందులో ఎంతవరకు నిజం ఉండనే విషయాన్ని తెలుసుకోవాలి.  ధోని ఔటయ్యాక కంటతడి పెట్టుకున్నప్పుడు ఫోటో గ్రాఫర్ కంటతడి పెట్టుకున్నారు అనే వార్తలు నిజం కాదని సమాచారం.  నిజానికి ఆ ఫోటోగ్రాఫర్ క్రికెట్ కు సంబంధించిన ఫోటో గ్రాఫర్ కాదట.  


అతను సాకర్ ఫోటోగ్రాఫర్.  ఏఎఫ్సి ఏసియా కప్ మ్యాచ్ లో ఖతార్ జట్టు ఇరాక్ పై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది.  సొంత జట్టు ఇరాక్ ఓటమి పాలైనపుడు దానికి సంబంధించిన ఫోటోలను తీస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఫోటోగ్రాఫర్ మహ్మద్ అజ్జావి.  ఈ ఫోటోగ్రాఫర్ ఫోటోను ధోని ఫొటోకు జోడించి ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: