బంగ్లాదేశ్ తో జరుగనున్న వండే మ్యాచ్ పర్యటన కోసం శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్న నేతృత్వంలో ఇరవై రెండు మంది జట్టును శ్రీలంక శుక్రవారం నియమించింది. మూడు వండే ఇంటర్నేష్నల్ మ్యాచ్ ల్లో మొదటిది జూలై 26 న, రెండవది రెండు రోజుల తరువాత, మరియు ఫైనల్ మ్యాచ్ జూలై 31 న జరగనుంది. ఈ మూడు ఆటలు కొలంబోలోని ప్రేమదాస్ స్టేడియంలో జరగనుంది.
శ్రీలంక జట్టు వివరాల్లోకి వెళితే: దిముత్ కరుణరత్న (కెప్టెన్), కుశాల్ పెరీరా, ఆవిష్క ఫెర్నాండో, కుశల్ మెండిస్, ఏంజిలో మ్యాథ్యూస్, లాహిరు తిరిమన్నె, శహన్ జైసూర్య, ధనంజయ డీసెల్వా, నిరోషన్ డిక్వల్ల, దనుష్క గుణతిలక, దసున్ షనక లాహిర్ మదుషంకా, లసిత్ మలింగా, నువాన్ ప్రదీప్, కసున్ రజిత, లాహిరు కుమార్, తిసారా పెరీరా, ఇసుర ఉదాన లను జట్టుగా నియమించారు.
ఇక బంగ్లాదేశ్ టీమ్ విష్యానికోస్తే: తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, సబ్బీర్ రెహ్మాన్, అహ్మదుల్లా, మొసాద్దిక్ హుస్సేన్, మహ్మద్ సైపుద్దీన్, మెహెడి హసన్, మహ్మద్ మిధున్, ముష్ఫీకర్ రహీం, అనాముల్ హక్, మష్త్రాఫ్ మోర్తాజా (కెప్టేన్), రుబెల్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తైజుల్ ఇస్లామ్ లను జట్టుగా ఎంపిక చేశారు.
జులై 26 న జరిగే మొదటి ఇంటర్నేషనల్ వన్డే మ్యాచ్ కోసం ఇరు జట్లు పోరాడటానికి సన్నద్ధమౌతున్నాయి. ఇరు జట్లలో ఎవరిని విజయం వరిస్తుందో వేచి చూడాల్సి ఉంది


మరింత సమాచారం తెలుసుకోండి: