మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు చెప్తే ప్రపంచ క్రికెట్ టీమ్స్ కు వణుకు పుడుతుంది.  ఇండియాకు ప్రతి ఫార్మట్ కప్పును అందించిన ధీరుడు.  1983 తరువాత 2011 లో ఇండియాకు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ ధోని.  టి 20 కప్ తీసుకొచ్చాడు.  అద్భుతమైన విజయాలను ఇండియాకు అందించాడు.  


అటు పాకిస్తాన్ లో జరిగిన మ్యాచ్ లలో జరిగిన మ్యాచ్ లలో ధోని ఆటతీరును అప్పటి పాక్ అధ్యక్షుడు ముషారఫ్ మెచ్చుకున్న సంగతి తెలిసిందే.  ఆ తరువాత ఇండియాకు కెప్టెన్ కావడం.. ఐపీఎల్ మ్యాచ్ లు స్టార్ట్ కావడం జరిగిపోయాయి.  


ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన అనేక మ్యాచ్ లలో విజయం సాధించాడు. కొత్తవాళ్ళను ప్రోత్సహించాడు.  బెస్ట్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్న ధోని, ఎన్నోసార్లు పడిలేచిన కెరటంలా మ్యాచ్ లో కొనసాగాడు.  మొన్న జరిగిన వరల్డ్ కప్ లో కూడా సాధ్యమైనంతగా మ్యాచ్ లను గెలిపించే ప్రయత్నం చేశారు.  


కాగా, సెమిస్ లో ఇండియా న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది.  ఆ సమయంలో ధోని మనసు చాలా బాధపడింది.  కానీ, తప్పదు.  ఓటమి తరువాత ధోని రిటైర్ అవుతారని అనుకున్నారు.  యావత్ భారతదేశం ధోని రిటైర్ కావొద్దని కోరడంతో.. దానిని విరమించుకున్నాడు. 

కరేబియన్ దీవుల్లో జరిగే మ్యాచ్ లకు ధోని అందుబాటులో ఉండటం లేదు.  సైన్యం తో కలిసి పనిచేయాలని అనుకున్నాడు.  ఇప్పటికే సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నారు.  కొన్నాళ్లపాటు సైన్యంతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాడు.  దీంతో యావత్ భారతదేశం శభాష్ ధోని అంటూ మెచ్చుకుంటున్నది. 


మరింత సమాచారం తెలుసుకోండి: