ధోనీ రిటైర్ మెంట్ విష్యంపై సోషల్ మీడియా లోనే కాకుండా బయట కూడా భారీగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, ధోనీ శనివారం ఒక ఆశ్చర్యకరమైన ప్రకటన చేశాడు.రాబోయే రెండు నెలల్లో తాను ప్రాదేశిక సైన్యం (టెరిటోరియల్ ఆర్మీ) లో పని చేయాలని భావిస్తున్నట్లు చెప్తూ,మూడు T20 లూ, మూడు వన్డేలూ, రెండు టెస్టులు ఆడేందుకు ఆగస్టు లో వెస్టిండీస్ లో పర్యటించనున్న భారత జట్టు ఎంపికకు అందుబాటులో ఉండనని బీసీసీఐకి స్వయంగా తెలిపాడు.


వెస్టిండీస్ పర్యటనకు జట్టు ఎంపిక కోసం ఆదివారం ముంబై లో సెలక్టర్లు సమావేశం కానున్న సంగతి తెలిసిందే.కాబట్టి, ఒక బీసీసీఐ సీనియర్ అధికారి ధోనీ విషయమై ఈ విధంగా స్పష్టత ఇచ్చారు. ఏమనగా, ధోనీ ఇప్పుడే క్రికెట్ నుంచి రిటైర్ అవ్వట్లేదు. అతడు ముందుగా అనుకున్న ప్రకారం సైన్యంలో పని చేసేందుకు రెండు నెలల విరామం కోరాడు ఈ విషయాన్ని మేం కెప్టెన్ కోహ్లీ, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కు తెలియజేశాం అని అన్నారు. పదాతిదళం పేరాచూట్ రెజిమెంట్ లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఇప్పుడు ధోని వ్యవహరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: