విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు చివరి రోజు ఉదయం భారత బౌలర్లు హవా కొనసాగింది.మ్యాచ్‌ రసవత్తరంగా మారింది.టీమిండియా నిర్దేశించిన 395 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. ఆదివారం చివరిరోజు ఆటలో భాగంగా దక్షిణాఫ్రికా 70 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. ఈ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో జడేజా మూడు వికెట్లు సాధించడ విశేషం.


బావుమాను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపిన షమీ.. డుప్లెసిస్‌(13), డీకాక్‌(0)లను సైతం ఔట్‌ చేశాడు. కాగా, మరో 10 పరుగుల వ్యవధిలో ఓపెనర్‌ మార్కరమ్‌(39),ఫిలిండర్‌(0, మహరాజ్‌(0)లను జడేజా బోల్తా కొట్టించడంతో సఫారీలు ఒక్కసారిగా పీకల్లోతు కష్టాల్లో పడ్డారు.ఇంకా దక్షిణాఫ్రికా 325 పరుగుల వెనుకబడి ఉండటంతో ఇక భారత్‌ విజయం ఖాయమే.టీమిండియా నిర్దేశించిన 395 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆదివారం చివరి రోజు ఆటలో భాగంగా దక్షిణాఫ్రికా 70 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. 11/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆటను కొనసాగించిన సఫారీలు వరుసగా కీలక వికెట్లను చేజార్చు కున్నారు.


బ్రయాన్‌ రెండో వికెట్‌ను అశ్విన్‌ పెవిలియన్‌కు పంపితే, ఆపై పేసర్‌ మహ్మద్‌ షమీ చెలరేగిపోయాడు. 40 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లను సాధించి దక్షిణాఫ్రికా టాపార్డర్‌ వెన్నువిరిచాడు.నాలుగో రోజు చివరలో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే రవీంద్ర జడేజా షాకిచ్చాడు. దక్షిణాఫ్రికా జట్టు స్కోరు 4 పరుగుల వద్ద ఓపెనర్ ఓపెనర్ డీన్ ఎల్గర్ (4) రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అంతకముందు దక్షిణాఫ్రికాకు టీమిండియా 395 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్‌ శర్మ (127: 149 బంతుల్లో 10ఫోర్లు, 7సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా.. పుజారా (81: 148 బంతుల్లో 13ఫోర్తు, 2సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: