లోకంలో కరోనా దిగులు మనుషులను కోలుకోకుండా చేస్తుంటే.. చేతిలో డబ్బులున్న వాడికి దురద లేసి వాటిని తప్పుడు మార్గంలో వదిలించుకుంటున్నాడు.. అర్ధం కాలేదా.. ఆకలితో సహాయం చేసేవారు ఎవరు లేక ఎందరో కరోనా బాధితులు అలమటిస్తుంటే.. సైబర్ మోసగాళ్ల బారిన పడిన యువకులు లక్షలు లక్షలు వదిలించుకుంటున్నారు.. ప్రపంచం అంతా కరోనా మీద దృష్టి పెడితే, ఈ నేరగాళ్ళు మాత్రం మనుషుల బలహీనత మీద కొడుతూ, అమ్మాయిలను వల వేసి అందిన కాడికి దోచుకుంటున్నారు.. ఇలాంటి ఎన్ని నేరాలు జరుగుతున్న విద్యావంతులు అని చెప్పుకుంటున్న వారిలో మార్పు మాత్రం రావడం లేదు..

 

 

ఇకపోతే తాజాగా సైబర్ నేరగాళ్లు ఎంచుకున్న మార్గం ఎలాంటి వాన్ని అయిన బోల్తా కొట్టిస్తుంది.. అది వాట్సప్‌లో వచ్చే వీడియో కాల్ ద్వారా.. అదెలా అంటే.. మీకు తెలియని నెంబర్ నుండి, ఒక వీడియో కాల్ వస్తుంది.. కాల్ లిఫ్ట్ చేయగానే అటువైపు నుంచి నగ్నంగా ఉన్న ఒక అమ్మాయి హాయ్‌.. అంటూ పలకరించి, లాక్‌డౌన్‌లో నేను ఇలాగే ఉంటున్నా.. మీరూ ఇలాగే ఉంటున్నారా? అంటూ మాటలు కలుపుతుంది. అప్పుడు మీరుగనుక నాలుక చప్పరించారంటే మీ ఇళ్లు, జేబు గుల్లవుతుంది.. ఎందుకంటే ఇదంతా నరాల బలహీనత ఉన్న వారినుండి రూ.లక్షలు కొట్టేసేందుకు సైబర్‌ నేరస్థులు ప్రయోగిస్తున్న తాజా మాయాజాలం. ఇకపోతే ఆ అమ్మాయితో మీరు చేసిన సంభాషణను స్క్రీన్‌ రికార్డింగ్‌ చేసి పలువురి నుంచి డబ్బు గుంజుతున్నారట.

 

 

ఇప్పటి వరకు ఇలాంటి ఫోన్‌ కాల్స్‌ తమకు వచ్చాయంటూ హైదరాబాద్‌కు చెందిన 40 మంది సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారట.. కాబట్టి మానసికంగా బలహీన పడకుండా, చెప్పాలంటే అమ్మాయిని నగ్నంగా చూడగానే సొల్లు కార్చకుండా ఇలాంటి వీడియోకాల్‌ వస్తే స్పందించవద్దని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు. ఒక వేళ ఎవరికైన ఇలాంటి వీడియోకాల్‌ వస్తే వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సమాచారం అందించాలని ఒక పోలీస్‌ అధికారి సూచించారు.. కాబట్టి మగవారు జాగ్రత్తగా ఉండగలరు.. మీకు డబ్బులు ఎక్కువ గనుక ఉంటే పేదలకు సహాయం చేయగలరని కొందరు పేర్కొంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: