ప్ర‌స్తుత స‌మాజంలో ప్రేమించుకోవ‌డం... పెళ్లిళ్లు చేసుకోవ‌డం విడిపోవ‌డం అనేది చాలా చాలా కామ‌న్ అయిపోయింది. ఎవ‌రు ఎవ‌రితో ఎప్పుడు ప్రేమ‌లో ప‌డుతున్నారో ?  ఎవ‌రి నుంచి విడిపోతున్నారో ?  కూడా తెలియ‌డం లేదు. ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల చేతుల్లో మోస పోవ‌డం మ‌నం కామ‌న్ గానే చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్క‌డ ఓ చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది.. ఓ అమ్మాయి అబ్బాయిని ప్రేమించింది పెళ్లాడాల‌నుకుంది.. అంత‌లోనే అత‌డు ఆమెను మోసం చేసేశాడు. పెళ్లీ లేదు గిళ్లీ లేదు చీ పో అన్నాడు. ఆదంతా కామ‌నే అయినా ఆమె మాత్రం చాలా వెరైటీగా రివేంజ్ తీర్చుకుంది. 

 

ఆ యువ‌తి త‌న ను మోసం చేసిన ప్రియుడిపై ఉల్లి పాయ‌ల‌తో ప‌గ తీర్చుకుంది. చైనాలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. చైనాకు చెందిన ఓ యువకుడు తన ప్రియురాలు జావోకు  ఇటీవలే బ్రేకప్ చేశాడు. దీంతో జావో త‌న పాత ప్రియుడుకు ఎలాగైనా గుణ‌పాఠం చెప్పాల‌ని అనుకుంది. అనుకుంతే త‌డ‌వుగా ఆమె ఓ ట‌న్ను ఉల్లి పాయ‌ల‌ను అత‌డి ఇంటి ముందు డంప్ చేసింది. ఓ లేఖ‌ను కూడా ఆ ఉల్లి పాయ‌ల‌పై వ‌దిలి వెళ్లింది. నేను మూడు రోజులుగా నువ్వు చేసిన మోసంతో ఏడుస్తున్నాను.. నువ్వు కూడా ఏడువు అంటూ లేఖ‌లో పేర్కొంది. ఇక చుట్టు ప‌క్క‌ల వారికి కూడా అత‌డి ఇంటి ముందు ఉల్లి పాయ‌లు వేయాల‌ని కోరింది.


 
ప్రియుడి ఇంటి ముందు కుప్పలుగా ఉల్లిపాయలను చూసి స్థానికులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ గా మారింది. బ్యాయ్ ఫ్రెండ్ బాగోతం అందరికీ తెలిసింది. అయితే దీనిపై స‌ద‌రు మాజీ భాయ్ ఫ్రెండ్ స్పందించాడు. త‌న పాత ప్రియురాలు ఎప్పుడు త‌న‌ను డామినేట్ చేయాల‌ని చూస్తుంద‌ని... త‌న మాటే నెగ్గాల‌ని అనుకుంటుంద‌ని.. అందుకే నాట‌కాలు ఆడుతోంద‌ని.. అందుకే ఆమె ఏడ్చినా తాను మాత్రం ఏడ్వ‌డం లేద‌ని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఉల్లిపాయ‌ల‌తో త‌న పాత ప్రియుడికి క‌న్నీళ్లు తెప్పించేందుకు ఆ ప్రియురాలు ఆడిన నాట‌కం మామూలుగా లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: