ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అన్ని దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చైనాలో మొద‌లైన ఈ క‌రోనా భూతం దండ‌యాత్ర‌.. ప్ర‌స్తుతం అన్ని దేశాలు చూట్టేసింది. ఇక మ‌రోవైపు ఈ క‌రోనాకు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. ప‌లు దేశాలు దీనిని క‌ట్ట‌డి చేసేందుకు లాక్‌డౌన్ విధించారు. దీంతో ప్ర‌జ‌లంద‌రూ ఇళ్ల‌కు ప‌రిమితం అయ్యాయి. అయితే ఈ క్ర‌మంలోనే విద్యార్థులు ఇప్పుడు తమ క్లాస్‌ సబ్జెక్ట్స్‌ నేర్చుకోవడానికి ఆన్‌లైన్‌ బాట పట్టారు. 

 

ఇప్పటికే కొన్ని పాఠశాలలు రాబోయే విద్యాసంవత్సరాన్ని ఆన్‌లైన్‌లో ప్రారంభించాయి. ఠంచన్‌గా క్లాస్‌రూమ్‌కు హాజరైనట్లుగా తమ గదిలోకి వెళ్లి ల్యాప్‌టాప్‌ ముందు కూర్చుని బుద్ధిగా క్లాస్‌కు హాజరవుతున్నారు విద్యార్థులు. అయితే ఈ ఆన్‌లైన్‌ క్లాసులు కొన్ని చోట్ల సమస్యాత్మకంగా మారుతున్నాయి. ఇక తాజాగా జరిగిన ఓ సంఘటన మాత్రం అందరినీ విస్తుపోయేలా చేసింది. కూతురి ఆన్ లైన్ క్లాస్ లో ఓ తల్లి నగ్నంగా ద‌ర్శ‌న‌మిచ్చింది. పూర్తివివ‌రాల్లోకి వెళ్తే.. అమెరికాలో యాష్లే ఫోర్ట్ స్మిత్ అనే మహిళకు ముగ్గురు కుమార్తెలు. లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. 

 

అయితే ఆమె చిన్న కూతురు ఫ‌స్ట్ క్లాస్ చ‌దువుతుండ‌గా.. జూమ్ యాప్ ద్వారా ఆమెకు ఆన్ లైన్ క్లాసెస్ నిర్వహించారు. దీంతో కూతురికి ల్యాప్ టాప్ ఇచ్చి ఆమె త‌న గ‌దిలోకి వ‌చ్చేసింది. అనంత‌రం ఆమె స్నానానికి వెళ్లి గదిలోకి వచ్చింది. అప్పుడు ఆమె ఒంటిపై టవల్ మాత్రమే ఉంది. దానిని కూడా తొలగించి డ్రెస్ వేసుకుందామని అనుకుంది. అప్పుడే సడెన్ గా అప్పుడే ఆమె ఓ విషయాన్ని గమనించింది. హాల్ లో ఉండాల్సిన కూతురు బెడ్రూమ్ లో ఉందని. అది కూడా ఆన్‌లైన్‌లో క్లాసులు వింటోంది. 

 

ఇక తాను నగ్నంగా తన కూతురి క్లాస్ మెట్స్, టీచర్స్ అందరికీ కనపడిపోయానని వెంటనే ఆమె అర్థం చేసుకుంది. దీంతో ఆమెకు ఏడ్పు వ‌చ్చినా.. ఏం చేయాలో అర్థంగాక న‌వ్వేసింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అక్క‌డితో వ‌ద‌ల‌ని యాష్లే ఫోర్ట్ స్మిత్.. ఈ విషయంపై తనలాంటి పేరెంట్స్ కి సలహాలు ఇస్తున్నారు. పిల్ల‌ల విష‌యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ తనకు ఎదురైన చేదు అనుభ‌వాన్ని అంద‌రితో పంచుకుంటోంది. 

  
  
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: