లోకంలో చెడుకు ఉన్న విలువ మంచికి లేదన్న విషయం మనకు నిత్యం ఏదో ఒకచోట కనిపిస్తూనే ఉంటుందన్న విషయం తెలిసిందే.. అంతే కాదు.. ఎవడైనా అడ్డదార్లో వెళ్ళుతుంటే అతన్ని మందలించి నీవు వెళ్ళే మార్గం సరైనది కాదు.. ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని అడిగితే చాలు.. ఇలా ప్రశ్నించిన వారు శత్రువులు అయిపోతారు.. అప్పటి నుండి మంచి చెప్పిన వారి మీద పగబట్టి ఎలాగైనా సాధించాలని చూస్తారు.. ఇలాంటి మనస్తత్వం ఉన్నవారు లోకంలో చాలామందే ఉన్నారు కానీ కంటికి కనిపించరు..

 

 

అంతే కాదు మంచి చెప్పే వారు స్నేహితులైనా, కుటుంబ సభ్యులైనా సరే వారేంది నాకు చెప్పడం అని అనుకుంటూ అదనుచూసి విచక్షణ మరిచి పాశవికంగా దాడులు చేస్తున్నారు. ఇక మరికొందరైతే మద్యం మత్తులో కన్న వారిని, కట్టుకున్న వారిని కడతేరుస్తున్నారు. ఇక్కడ ఒక ఇల్లాలు తన భర్తను ఇలానే మందలించిన పాపానికి ఆ మూర్ఖుడు ఏకంగా ప్రాణాలే తీసాడు. ఒకరకంగా భర్తకు చెప్పిన మంచి మాటలే ఆ ఇల్లాలి ఉసురు తీశాయి. ఆ వివరాలు తెలుసుకుంటే.. 25 ఏళ్ల కిందట నారాయణ్‌ఖేడ్‌కు చెందిన సంజీవ(54) తో పటాన్‌చెరు సమీపంలోని ఆర్‌.సి.పురానికి చెందిన రాణి(42)కి పెళ్లయింది. కాగా  వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

 

 

ఇక వీరంతా ఎస్సార్‌నగర్‌ ఠాణా పరిధిలోని టీబీ సెంటర్‌ ఆవరణలో ఉన్న క్వార్టర్‌ నం.1లో నివాసం ఉంటున్నారు.. పెద్ద కుమార్తెకు వివాహం అవగా వీరితో డిగ్రీ చదువుతున్న చిన్న కుమార్తె, ఇంటర్‌ చదివే కుమారుడు ఉంటున్నారు.. మద్యానికి బానిసగా మారిన సంజీవ నిత్యం తాగి వచ్చి భార్యతో ఘర్షణ పడేవాడట.. ఈ క్రమంలో ఆదివారం ఫూల్‌గా తాగివచ్చిన సంజీవ ఇంట్లో పెద్ద గొడవ చేశాడట, ఇక సోమవారం ఉదయం కూడా భార్యతో ఘర్షణకు దిగిన ఇతను ఆవేశంలో కత్తితో ఆమె ఛాతిలో పొడవడంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆ సమయంలో పిల్లలిద్దరు వాళ్ల అమ్మమ్మ ఇంటికి వెళ్ళగా ఈ ఘటన చోటుచేసుకుంది..

 

 

కాగా ఉదయం 10 గంటలకు ఇద్దరు పిల్లలకు ఫోన్‌ చేసి.. మీ అమ్మ లేవడం లేదని చెప్పడంతో వెంటనే ఇంటికొచ్చిన పిల్లలకు తల్లి రక్తం మడుగులో మరణించి కనిపించగా, కోపంతో తండ్రిని నిలదీయగా అతను పారిపోయాడు. ఇక ఈ విషయాన్ని మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు తెలుపగా ఘటనా స్థలిని పరిశీలించిన ఎస్సార్‌నగర్‌ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అతని కోసం వెతుకుతున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: