సభ్య సమాజం తలదించుకునే సంఘటన మరొకటి జరిగింది. తన కన్న కూతురి పై తండ్రి అఘాయిత్యానికి పాల్పడి గర్భవతిని చేసిన సంఘటన తమిళనాడులోని నాగపట్టిణం జిల్లాలో జరిగింది.  మైలాదుత్తురైకి సమీపంలోకి సెంబనర్కోలి పట్టణానికి చెందిన కార్ డ్రైవర్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆ తండ్రికి కళ్ళు మూసుకుపోయి ఏకంగా తన కన్న కూతురి పై కన్నేశాడు ఆ దుర్మార్గుడు. కేవలం ఇంటర్ చదువుతున్న ఆ మైనర్ బాలికపై అఘాయిత్యానికి తెగబడ్డాడు ఆ నీచుడు. తనపై పశువులా దాడి చేసి అతని కామవాంఛను తీర్చుకున్నాడు కిరాతక తండ్రి. 

IHG


అసలు ఈ విషయం ఎలా బయటకు వచ్చింది అంటే... సదరు బాలికకు కడుపునొప్పి రాగా, దాంతోపాటు వాంతులు అవుతుండడంతో తల్లి ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లి పరీక్షలు చేయించింది. ఆ పరీక్షల్లో బాలిక కడుపుతో ఉందని తెలియడంతో తల్లి షాక్ కు గురయింది. పెళ్లి కాకుండానే గర్భవతి ఎలా అయింది అని కోపంతో కూతురును మందలిస్తూ గుండెలు పగిలేలా రోదించారు. అసలు ఈ దారుణానికి ఎలా కారణమని బాలిక అడగగా అప్పుడు ఆ తండ్రి నీచ సంస్కృతిని బయటపెట్టింది.

 

గత మూడు నెలలుగా తనపై నరకం చూపిస్తున్నాడని చెప్పడంతో ఆ తల్లి దిగ్భ్రాంతికి లోనైంది. కామంతో కన్న తండ్రి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తల్లి పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. కన్న కూతురిపై అత్యాచారం చేశాడని బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి లైంగిక నేరాల కింద అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: