ప్రజలను కాపాడాల్సిన రక్షకభటుడు కీచకంగా మారి ఓ వివాహితపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఒడిస్సా రాష్ట్ర సంబంధించిన పోలీస్. అర్ధరాత్రి సమయంలో సహాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్తున్న ఓ వివాహితను మార్గ మద్యంలో అడ్డగించి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు ఆ కీచక పోలీస్. ఇకపోతే నగరంలో ఓ వివాహిత ఆదివారం నాడు రాత్రి తన భర్తతో గొడవపడి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కు కాలినడకన బయలుదేరింది. 

 

ఇకపోతే మార్గమధ్యంలో స్నేహితులతో కలిసి ఆటోలో వెళ్తున్న కానిస్టేబుల్ దశరధ్ నాయక్ ఆమెను ఆపి విశేషాలను తెలుసుకున్నారు. అయితే కానిస్టేబుల్ దశరధ్ ఆమెకు మాయమాటలు చెప్పి నేను నీకు సాయం చేస్తానని చెప్పి ఆటోలో ఎక్కించుకున్నాడు. అలా ఎక్కించుకున్న ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళుతుండగా ఆటో లో అనేక ప్రాంతాల్లో తిరుగుతూ చివరికి సహీద్ నగర్ ప్రాంతానికి ఆవిడను తీసుకువెళ్ళాడు. ఇకపోతే అక్కడ కానిస్టేబుల్ తన ఫ్రెండ్ తో కలిసి ఆ సదరు వివాహితపై అత్యాచారం కి ప్రయత్నించాడు. 


దీని నుంచి కాపాడుకోవడానికి ఆ వివాహిత గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని కానిస్టేబుల్ అతడి ఫ్రెండ్ ఆటో డ్రైవర్ ను ముగ్గురు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఇక ఈ విషయంపై పూర్తి విచారణ కు పోలీస్ శాఖ దర్యాప్తు చేపట్టింది. ఈ ఘటనపై డిసిసి అనుకుమార్ సాహూ పూర్తి వివరాల కోసం ఆదేశించారు. ప్రజల్ని కాపాడాల్సిన పోలీసులు ఇలా చేస్తే ప్రజలు ఇంకా ఎవరిని చేరుకొని వారి బాధను చెప్పుకోవాలో....? కేంద్ర ప్రభుత్వం మహిళలపై అఘాయిత్యాలు కోసం అనేక కఠిన నిర్ణయాలు తీసుకున్న కొందరి ప్రవర్తన మాత్రం అసలు మారడం లేదు. వీరు ఎప్పుడు మారుతారో దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందో ...?

మరింత సమాచారం తెలుసుకోండి: