దేశంలో రోజురోజుకీ దారుణాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా మహిళలపై ఇలాంటి సంఘటనలు ఎక్కువవుతున్నాయి. ప్రభుత్వం ఇలాంటి వారికి అనేక శిక్షలను ఖరారు చేసిన చివరికి ఏదో ఒక మూలన దేశంలో రోజుకి ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. ఇకపోతే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ఒక దారుణ సంఘటన జరిగింది. అదికూడా ఓ జిల్లా కలెక్టర్ ఆఫీసులో జిల్లా కలెక్టర్ చేయడం నిజంగా ఆలోచించాల్సిన విషయం. కలెక్టర్ కార్యాలయంలో పనిచేసే ఓ వ్యక్తిని తాను సస్పెండ్ చేస్తానని బెదిరించి, ఆ వ్యక్తి భార్యపై ఆ జిల్లా కలెక్టర్ దారుణానికి పాల్పడ్డాడు. 

IHG


ఇక ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే... ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని జగదీర్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ జిల్లాకు కలెక్టర్ గా పనిచేస్తున్న జనక్ ప్రసాద్ పాథక్ మే 15వ తేదీన కలెక్టర్ కార్యాలయం లోనే సదరు వ్యక్తి భార్యపై అత్యాచారం చేశారని 33 సంవత్సరాల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భర్తను సస్పెండ్ చేస్తామని బెదిరించి తనను కలెక్టరేట్ కు పిలిపించి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని జిల్లా కలెక్టర్ పై మహిళ పోలీసులకు సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. 


దీనితో కలెక్టర్ పై ఐపీసీ 506, 509 b, 376 కేసుల  కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు  జంగజీర్ చాంపా జిల్లా ఎస్పీ పారుల్ మాధూర్ తెలియజేశారు. ఇకపోతే మహిళపై అత్యాచారం చేసిన కలెక్టర్ పై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అతనిపై సదరు బాధ్యతల నుండి తప్పించి రాష్ట్ర ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ గా ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రజలను కాపాడాల్సిన పదవిలో ఉండి ఇలా చేయడం ఎంతవరకు సమంజసమని అర్థం కావట్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: