ప్రస్తుత రోజులలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళల కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్న కూడా... అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఎటువంటి భయం లేకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. ఓ బాలిక స్నానం చేస్తుండగా ఒక యువకుడు రహస్యంగా వీడియో తీసి.. ఆ బాలికను బెదిరింపులకు గురి చేశాడు. అంతేకాకుండా బాలికకు ఆ వీడియోలు చూపించి... బాలికను లోబరుచుకుని పలుసార్లు లైంగికదాడికి పాల్పడటం జరిగింది. దీనికి ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చడం జరిగింది.

 

ఇక పోతే ఈ దారుణమైన సంఘటన ఎక్కడో కాదండి విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ విషయం పూర్తి వివరాల్లోకి వెళితే... విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలో అగ్రహారానికి చెందిన ఒక బాలిక .. ఊరి లోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. ఇక బాలిక స్నానం చేస్తుండగా... వారి ఇంటి వెనకాల ఉన్న రాజా అనే వ్యక్తి రెండు నెలల క్రితం సెల్ ఫోన్లో ఫోటోలతో పాటు బాలిక స్నానం చేస్తున్న వీడియో కూడా తీయడం జరిగింది. ఈ తరుణంలోనే ఆ బాలికకు నిత్యం ఫోటోలు, వీడియోలు చూపించి తన కోరికలను తీర్చాలి అంటూ బాలికను ఆ యువకుడు బెదిరించేవాడు. అంతేకాకుండా తన కోరిక తీర్చలేదు అంటే ఆ వీడియో ఫోటోలు ఫేస్ బుక్ లో పెడతాను అంటూ బెదిరించడం జరిగింది. 


దీంతో ఆ బాలిక ఏమి చేయలేని పరిస్థితిలో భయపడి ఆ కామాంధుడికి లొంగిపోవడం జరిగింది. ఈ తరుణంలోనే నెలలు గడుస్తున్నా ఆ బాలికకు రక్తస్రావం కాలేదన్న అనుమానంతో తల్లి పట్టణంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకుని వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించింది. దీనితో పరీక్షల అనంతరం గర్భవతి అయ్యిందని నిర్ధారణ అవ్వడం ఉంది. ఆ తర్వాత బాలిక తల్లి ఆ బాలికను నిలదీయగా అసలు విషయం బయటకు ఆమె తెలియచేసింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ తరుణంలోనే బొబ్బిలి డిఎస్పి చీపురుపల్లికి వచ్చి దర్యాప్తు కూడా నిర్వహించారు. ఇక నిందితుడు అయిన రాజా ను అదుపులోకి తీసుకొని పోలీస్ అధికారులు విచారణ మొదలుపెట్టారు. రాజు పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని... దర్యాప్తు చేస్తున్నారు పోలీస్ అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: