ప్రేమ అనేది పవిత్రమైనది.. రెండు మనసుల కలయిక.. ప్రేమ ఒక తియ్యని అనుభూతి.. అని కవులు ప్రేమను కవులు వర్ణించారు.. అందుకే ప్రేమ గురించి తెలియాలంటే ఒక్క సారైనా ప్రేమ లో పడాలని అంటారు.. కానీ ఇప్పుడు మాత్రం యువత ప్రేమ పేరు తో అడ్డదారులు తొక్కుతున్నారు.. శారీరక సుఖం కోసం లేదా అవసరాల కోసం మాత్రమే ప్రేమిస్తున్నారు..అసలు విషయానికొస్తే ఇద్దరు ప్రేమించుకున్నారు.. అనుకోని సంఘటనలు వల్ల అమ్మాయి అబ్బాయికి బ్రేకప్ చెప్పింది.. దాంతో కోపొద్రుడైనా ప్రియుడు దారుణానికి పాల్పడ్డాడు..

 

 

 

వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని బరైపూర్ జిల్లాకు చెందిన యువకుడు నోయిడా థర్డ్‌ ఫేజ్‌ ప్రాంతంలో నివాసం ఉండేవాడు. స్థానికంగా ఓ యువతిని ప్రేమించాడు. అలా ప్రేమలో పడ్డ ఆ ఇద్దరు లోకాన్ని మరచి ఎంజాయ్ చేశారు..ఇద్దరూ చాలాకాలం కలసి తిరిగారు. పెళ్లి కాకుండానే హద్దులు దాటారు. కొన్నేళ్ల తర్వాత ఇద్దరూ బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని ద్వేషం పెంచుకున్న ప్రియుడు నీచానికి పాల్పడ్డాడు.

 

 


ఇద్దరు ఏకాంతంగా గడిపిన వీడియోలు, ఫోటోలను పోర్న్ సైట్ లకు ఇచ్చేశాడు.పోర్న్‌ సైట్లలో ఫొటోలు, వీడియోలు చూసి షాకైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. పలు సెక్స్ సైట్లకి ఆమె నగ్న చిత్రాలు, వీడియోలు అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. మాజీ ప్రియురాలి నగ్న చిత్రాలు అమ్మేసి పేటీఎం ద్వారా డబ్బులు సంపాదించాడు.వెంటనే స్పందించిన ప్రియురాలు పోలీసులకు సమాచారం అందించగా రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు..అతన్ని అదుపులోకి తీసుకుని ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు..చూసారుగా డబ్బు పిచ్చిలో ప్రేమించిన అమ్మాయిని ఎలా బజారు పాలు చేశాడో .. జాగ్రత్త సుమీ..ప్రేమించండి కానీ హద్దులు దాటకండి అని పోలీసులు హెచ్చరిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: