మనుషుల్లో తప్పు చేయాలనే భావన వచ్చింది మొదలు అనుకున్న పని చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు.. అది మగవారైనా, ఆడవారైనా.. చివరికి బాధ్యత గల వృత్తిలో ఉన్న వారైన సరే మంచిని మరచి చెడు దార్లో వెళ్లుతున్నారు.. మరీ ముఖ్యంగా పోలీసులంటే ప్రజలకు ఉన్న అభిప్రాయం గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు.. తప్పుచేస్తే శిక్షించే అధికారం ఉన్న వారే ఎన్నో తప్పులకు కేరాఫ్‌గా మారుతున్నారు.. ఇక్కడ ఒక కానిస్టేబుల్ కూడా మహిళ పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది..

 

 

ఆమెతో ఉన్న శారీరక సంబందాన్ని అడ్డుపెట్టుకుని ఆ మహిళ నుంచి రూ.35 లక్షలు అప్పుగా తీసుకున్న సదరు కానిస్టేబుల్‌.. వాటిని చెల్లిస్తానని పిలిచి తన మిత్రుడిని ఆమెపై అత్యాచారానికి ప్రేరేపించాడు. సదరు బాధితురాలు ఎలాగో వారినుండి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.. ఆ వివరాలు తెలుసుకుంటే.. ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్న వెంకట రాజేష్‌ అనే కానిస్టేబుల్‌కు.. ఒంగోలు దిబ్బలరోడ్డుకు చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం క్రమక్రమంగా అక్రమ సంబంధంగా మారడంతో ఆ చనువుతో ఈ కానిస్టేబుల్ ఆమె నుంచి రూ.35 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అంతే కాకుండా ఆ మహిళతో సన్నిహితంగా ఉన్న సమయంలో తనకు తెలియకుండా నగ్నచిత్రాలు, వీడియోలు కూడా తీశాడట..

 

 

ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ మహిళ డబ్బులు చెల్లించమని కోరగా, బెదిరింపులకు దిగడమే కాకుండా ఆమెతో గడిపిన చిత్రాలు చూపించడం మొదలుపెట్టాడట.. ఇంతటితో ఊరుకోకుండా తాను తీసుకున్న డబ్బులు చెల్లిస్తానని నమ్మించి నెల 8న తన స్నేహితుడు విశ్రాంత సైనికోద్యోగి అయినా నల్లూరి సుధాకర్‌ ఇంటికి పిలిచి, సుధాకర్‌ను అక్కడ ఆమెపై అత్యాచారం చేసేందుకు రాజేష్‌ ప్రేరేపించాడట. దీంతో అక్కడి నుండి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో, నిందితులను అదుపులోకి తీసుకున్న వారు విచారణ చేపట్టారట.. ఇక ఇలాంటి వారివల్ల పోలీస్ డిపార్ట్‌మెంట్ మొత్తానికి చెడ్దపేరు వస్తున్న వీరిలో మార్పులేదు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: