డబ్బు అనేది మనిషికి జబ్బులగా పట్టుకుంది. డబ్బులు వస్తాయంటే సొంతవాల్లను కూడా కష్టాల పాలు చేస్తున్నారు.కాస్త తెలివిని పెట్టుబడిగా పెట్టీ చాలా మంది డబ్బును సంపాదిస్తున్నారు.. ఇక్కడ ఓ వ్యక్తి డబ్బు సంపాదించాలనే పిచ్చిలో చేసిన మోసం చూస్తే నోర్లు వెళ్ళబెట్టల్సిందే..అతను చదివింది పదో తరగతి.. వచ్చింది పల్లెటూరు నుంచి.. కానీ, మోసం చేసింది మాత్రం సంపన్నులను.. సాప్ట్‌వేర్ ఇంజనీర్‌లతో పాటు ప్రముఖుల పిల్లల్ని, ధనవంతులను టార్గెట్ చేసి దోచుకున్నాడు.

 

 


వివరాల్లోకి వెళితే.. జుంబా డాన్స్ పేరుతో హైదరాబాద్ నగరంలో శుక్రవారం భారీ మోసం వెలుగు చూసింది. జుంబా డాన్స్ క్లాసులకు హాజరవుతుంటే సన్నగా నాజూకుగా తయారు చేస్తానంటూ బాగా ప్రచారం చేశాడు. ఈ క్రమంలోనే రెండు సెంటర్లను ఓపెన్ చేసాడు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి, హైటెక్ సిటీలో జుంబా డ్యాన్స్ సెంటర్లను ఏర్పాటు చేశాడు.బాగా ప్రచారం కల్పించడంతో మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ చాలామంది మహిళలు జుంబా డాన్స్ కేంద్రాల ముందు క్యూ కట్టారు. ముఖ్యంగా మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లతో పాటుగా ప్రముఖుల పిల్లలు, వ్యాపారవేత్తలు ఈ కేంద్రం ముందు వచ్చి వాలిపోయారు.

 

 


అయితే, ఈ జుంబా డ్యాన్స్ కు ఎక్కువగా మహిళలు రావడంతో అతని డ్యాన్స్ కు పాపులారిటీ బాగా పెరిగింది. దాన్ని ఆసరాగా చేసుకున్న చిరంజీవి అన్నీ ఏరియాల్లో ఈ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు నమ్మించి మహిళల దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు.ఈ మోసాలకు అందాన్ని ఎరగా వేశాడు.తన అందంతో మహిళలను వలలో వేసుకున్నాడు.దాంతో మహిళల భర్తలకు అనుమానం రావడంతో అసలు వ్యవహారం బయట పడింది.

 

 


దాంతో  తాము ఇచ్చిన డబ్బులను వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అతను పారిపోయాడు.తాము మోసపోయామని తెలుసుకున్న మహిళలు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిర్వహకుడైన చిరంజీవిపై కేసు పెట్టి విచారణ ప్రారంభించారు. ఇప్పటివరకు చాలా మంది మహిళలను చిరంజీవి మోసం చేశాడని, చాలా మంది మహిళల దగ్గర నుంచి డబ్బు వసూలు చేశాడని తెలిపారు. కొంతమంది మహిళలను తనవైపు తిప్పుకున్నారని పోలీసులు విచారణ బయటపడినట్లు గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు . డబ్బుల కోసం ఇలాంటి ప్రకటనలతో చాలా మంది పుట్టుకొస్తున్నారని వాటిని నమ్మి మోసపోవద్దు పోలీసులు హెచ్చరించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: