ఆంధ్రాలో కలకలం సృష్టించిన దివ్య హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.. నమ్మిన వారి చేతిలో మోసపోయి చిత్రహింసలకు గురై ప్రాణాలు కోల్పోయిన దివ్య కేసులో ఎన్నో దారుణాలు, మరెన్నో కోణాలు వెలుగుచూస్తున్నాయి. విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుండటంతో పోలీసులు షాకవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో పేద కుటుంబంలో పుట్టిన దివ్య చిన్నతనంలోనే తల్లి, తమ్ముడు, అమ్మమ్మ హత్యకు గురవడంతో విశాఖ నగరంలోని ఎన్‌ఏడీ కూడలి వద్ద ఉండే గీత వద్దకు చేరింది. దివ్య అందాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న గీత మాయమాటలతో ఆమెను వ్యభిచార రొంపిలోకి దించి డబ్బు సంపాదించింది. 

 

 

 

అయితే.. అక్కడ నరకాన్ని భరించలేక కొద్ది నెలల తర్వాత దివ్య తప్పించుకుని స్వగ్రామానికి వచ్చేసింది. తర్వాత ఆమెకు ఏలేశ్వరం ప్రాంతానికి చెందిన వీరబాబుతో బంధువులు వివాహం చేశారు.అయితే అతను కొద్దీ రోజులు బాగానే చూసుకున్నాడు.తర్వాత వ్యభిచారం చేసిందని తెలుసుకున్న భర్త ఆమెను డబ్బుల కోసం వేధించేశాడు. జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసైన అతడు దివ్య మళ్లీ వైజాగ్ తీసుకొచ్చి గీతకు అప్పగించాడు. ఆమెతో వ్యభిచారం చేయించగా వచ్చే సంపాదనలో కొంత భాగం తనకు పంపించాలని ఒప్పందం చేసుకున్నాడు. గీత వద్దే కొద్దిరోజుల పాటు ఉన్న దివ్య అక్కడి నుంచి అక్కయ్యపాలెంకు చెందిన వసంత అలియాస్ జ్యోతి వద్దకు చేరింది. 

 

 

 

దివ్యతో రోజంతా వ్యభిచారం చేయిస్తూ వచ్చే సొమ్మును వసంతతో పాటు గీత, ఇతరులు పంచుకునేవారు. తన శరీరంలో వ్యాపారం చేస్తూ తనకు తక్కువ డబ్బులు ఇస్తుండటంతో దివ్య ఎదురు తిరిగింది. తాను అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వేరు కుంపటి పెట్టుకుంటానని బెదిరించడంతో ఆరు రోజుల పాటు చిత్రహింసలు చేసి చంపేశారు.వసంత, గీతను ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.దివ్య తల్లి సుబ్బలక్ష్మి, సోదరుడు గణేష్‌ అమ్మమ్మ నాగమణి ఓ రౌడీషీటరు చేతిలో హత్యకు గురయ్యారు.ఆ కోణంలోనూ విచారణ సాగిస్తున్నాం. హత్యతో సంబంధం ఉన్న మిగిలిన నిందితుల కోసం రెండు బృందాలు ఇప్పటికే రావులపాలెం, ఏలేశ్వరం లో వేతికించే పనిలో ఉన్నారని  పోలీసులు తెలిపారు.అయితే రోజుకో మలుపు తిరుగుతున్న దివ్య హత్య కేసుకు సంబంధించిన అసలు హంతకుడిని త్వరలోనే పట్టుకుంటామని చెప్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: