ఆడవాళ్ళు ఒకప్పుడు తల దించుకొని అడిగినదానికి సమాధానం ఇస్తూ.. ఇంటిని కాపురాన్ని ఒంటి చేత్తో నడిపిస్తూ ఉండేవారు.. కానీ ఇప్పుడు రూటు కొంచం మారింది.  ప్రభుత్వమే ఆడవాళ్ళకు అన్నీ రంగాల్లో సమాన హక్కులను కలిగించింది వారికి ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చింది. దీంతో రాజకీయాల్లో కూడా రాణిస్తూ మగాళ్ళను గడ గడ లాడిస్తున్నారు..అందుకే మహిళలను రక్షించండి అంటూ అన్నీ రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు..  విషయానికొస్తే.. ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు మగవాళ్ళ కన్నా ఎక్కువగా క్రైమ్ లో మోసాలు చెస్తూ వస్తున్నారు.. 

 

 

 

ఇక్కడ ఒక విచిత్రం వెలుగు చూసింది.. పెళ్లి పేరుతో చాలా మంది ఆడవాళ్ళు మోసాలకు పాల్పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో వెలుగు చూసింది..నరోడా ఏరియాకి చెందిన జయేష్ రాథోడ్‌కి మంచి పెళ్లి సంబంధం ఉంటే చూడమని అతని బంధువు మను రాథోడ్ తన స్నేహితుడు మణిలాల్‌కి చెప్పాడు. సరేనన్న మణిలాల్ రాజస్థాన్‌కి చెందిన కళావతి ఖరాదీ, ఆమె తండ్రి సంజీత్ ఖరాదీ సహా మరో వ్యక్తి మోహన్‌లాల్ భగోరాతో కలసి జయేష్ ఇంటికెళ్లాడు. అక్కడ ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు.

 

 

 

ఇద్దరికీ నచ్చడంతో ఇరు కుటుంబాలు వారికి పెళ్లి చేయాలని నిర్ణయించారు..అయితే వధువు తండ్రి పెళ్లి ఖర్చులకు 1లక్ష రూపాయలు అప్పు గా ఇవ్వమని కోరాడు..దాంతో మనవాళ్ళే కదా అని వరుడి కుటుంబ సభ్యులు ఇచ్చారు.. అనంతరం ఇద్దరికీ పెళ్లి జరిగింది.నెల రోజులకే అత్తారింటిని సర్దేసింది. నగలు, ఇతరు విలువైన వస్తువులతో ఉడాయించింది. ఓ రోజు సడెన్‌గా ఆమె కనిపించకుండా పోవడంతో పుట్టింటికి వెళ్లి ఉంటుందని భర్త భావించాడు. ఎన్నిరోజులైనా తిరిగి రాకపోవడంతో రాజస్థాన్‌లో ఉన్న మామకి ఫోన్ చేయడంతో అల్లుడి దిమ్మతిరిగిపోయింది. తన కూతురు ఇంకెప్పటికీ అక్కడికి రాదని చెప్పడంతో కంగుతిన్నాడు.

 

 

 

డబ్బులు, నగల కోసమే పెళ్లి చేసుకున్నట్లు చెప్పడంతో షాక్‌కి గురయ్యాడు. ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో భయపడిన జయేష్. పోలీసులను ఆశ్రయించాడు. పెళ్లి పేరుతో డబ్బు, నగలు దోచుకున్నారని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇలాంటి మోసాలు ఇప్పుడు గుజరాత్ లో ఎక్కువగా జరుగుతున్నాయని ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరించారు.. త్వరలోనే ఆ కిలాడిని పట్టుకుంటామని పోలీసులు భరోసా ఇచ్చారు...

మరింత సమాచారం తెలుసుకోండి: