లోకంలో ఎన్ని దారుణాలు జరుగుతున్నా, ఎంత మంది ప్రాణాలు పోతున్నా, భయపడే వారు భయపడుతున్నారు, మూఢనమ్మకాలతో జీవించే వారు జీవిస్తున్నారు.. నేరాలు ఘోరాలు చేసే వారు చేస్తూనే ఉన్నారు.. మానవజాతి అంతమయ్యే వరకు కూడా మనషుల్లో ఉన్న కౄరత్వం మరణించేలా లేదు.. ఒకవైపు కరోనా వల్ల ఎవరు ఎంతవరకు బ్రతుకుతారో అనే తెలియని పరిస్దితుల్లో కూడా మర్డర్లు, రేపులు, దోపిడీలు యదేచ్చగా లోకంలో జరుగుతున్నాయంటే సమాజంలోని పరిస్దితులు ఎలా మారుతున్నాయో అర్ధం అవుతుంది..

 

 

ఇకపోతే ఒకప్పుడు చావుకు భయపడేవారు, కాని నేటికాలంలో బ్రతకడానికి భయపడుతున్నారు.. ఎందుకంటే మనికి ఉన్న విలువ మనిషి ప్రాణానికి లేదు.. మనుషులను మనుషులు చంపుకోవడం కామన్‌గా మారింది.. ఇక ఒడిశాలో చేతబడి ఆరోపణలతో ఓ మహిళ తలను నరికి దానిని చేత్తో పట్టుకుని 13 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు ఓ వ్యక్తి... ఆ వివరాలు చూస్తే.. ఒడిశాలోని, ఖుంటూ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిరిజన గ్రామమైన నువాసహిలో కుటుంబంతో కలిసి జీవిస్తున్న  బుద్దురామ్ సింగ్ (30) అనే అతని కుమార్తె మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురై మృతి చెందింది.

 

 

కాగా తన కుమార్తె మరణానికి వరుసకు అత్త అయిన చంపాన్ సింగ్ (60) చేతబడి చేయడం వల్లే తన కుమార్తె మరణించిందని అనుమానించి ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ నేపధ్యంలో నిన్న ఉదయం ఇంటి వరండాలో నిద్రిస్తున్న చంపాన్‌సింగ్‌ను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఆ తర్వాత మొండెం నుంచి తలను వేరు చేసి, ఆ తలను తువ్వాలులో చుట్టుకుని, గొడ్డలిని చేతిలో పట్టుకుని, అక్కడి నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లి లొంగిపోయాడు..

 

 

ఇక అతడిచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతురాలి మొండాన్ని స్వాధీనం చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: