పిల్లలను పెంచడం చేతకాకపోతే కనడం మానేయాలి. అంతేకాని కానీ వారిపై పైశాచికత్వం చూపించకూడదు అని అంటున్నారు నెటిజన్లు. అవును.. నిజం.. మనుషుల్లో రోజు రోజుకు మానవత్వం మంటగలుస్తోంది. పిల్లల అల్లరిని తట్టుకోలేని తల్లితండ్రులుగా మిగిలి వారిని కనికరం లేకుండా హత్యలు చేస్తున్న రోజులు వచ్చాయి. 

 

IHG

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్ లో ఓ వ్యక్తి అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. అభంశుభం తెలియని ఇద్దరి పిల్లలను నాలుగో అంతస్తు నుండి విసిరేసి వార్తల్లో నిలిచాడు. ఒక్క ఈ ఘటనే కాదు పాశవికంగా హతమార్చాడు ఆ కసాయి తండ్రి. కలకత్తాలోని బుర్జా బజార్ ప్రాంతంలో ఓ కుటుంబం నివాసముంటోంది. 

 

IHG

 

ఇంకా 55సంవత్సరాల వయస్సు ఉన్న ఓ వ్యక్తికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆ పిల్లలు ఇద్దరు బాగా అల్లరి చేస్తున్నారని ఆ ఇద్దరు చిన్నారులను దారుణంగా అపార్టుమెంటులోని 4వ అంతస్తు నుంచి కిందకు విసిరేశాడు. ఇంకా ఈ ఘటనలో ఓ చిన్నారి మరణించగా మరో చిన్నారి ఆసుపత్రిలో కొనఉపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. 

 

IHG's two children from 4th floor ...

 

ఇంకా ఈ విషయంపై స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు.. అయితే ఆ చిన్నారులు ఇద్దరు బాగా అల్లరి చెయ్యడం భరించలేకే వారిని పైనుంచి కిందకు విసిరేసినట్టు ఒప్పుకున్నాడు. అయితే పిల్లలను చంపడం తన ఉద్దేశ్యం కాదు అని క్షణికావేశంలో ఇద్దరిని పైనుంచి పడేశానని అయన తెలిపారు. కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: