ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం తో లాక్ డౌన్ కొనసాగింది.. ఈ తరుణం లో స్నేహితులను కలవడం, బంధువులను కలవడం లాంటివి బంద్ చేసి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే, కరోనా ప్రభావం కొంతవరకు తగ్గడంతో ఫ్రెండ్స్ ను కలవడం పార్టీలను ఏర్పాటు చేయడం లాంటివి మళ్ళీ మొదలయ్యాయి. స్నేహితులు ఉత్సహంగా పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అలా ఏర్పాటు చేసుకున్న పార్టీలో మద్యం తాగి స్నేహితుడని కూడా చూడకుండా దారుణంగా పొడిచి చంపాడు మరో స్నేహితుడు.

 

 


వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ సంఘటన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. వెస్ట్ బెంగళూరు పరిధిలోని కెంగెరి ప్రాంతానికి చెందిన సందీప్ రెడ్డి(25), కృష్ణమూర్తి (25), రేవణ్ణ సిద్దప్ప (33), మణికంఠ(28) స్నేహితులు. అందరూ కలసి మే 31న ఓ ఇంట్లో మందుపార్టీ చేసుకున్నారు. చికెన్ బిర్యాని తెచ్చుకున్నారు. అయితే అందరు తగిన తర్వాత బిర్యానీ తిన్నారు. అందులో ఒకరికి బిర్యానీ ఉంచకుండా మొత్తం అందరు తినేశారు. దానికి కోపంతో ఊగిపోయిన అతను స్నేహితుడిని గట్టిగా నిలదీసాడు. 

 

 

 

గొడవ శృతి మించడంతో మాటామాటా పెరిగి  ఆగ్రహం చెందిన సందీప్, మూర్తి, రేవణ్ణ దాడికి దిగారు. ముగ్గురూ కలసి మణికంఠని కొట్టడంతో అతను ఎదురుతిరిగాడు.మాకే ఎదురుతిరుగుతావా అంటూ మద్యం మత్తులో రెచ్చిపోయిన స్నేహితులు కత్తితో దారుణంగా పొడిచేశారు. విచక్షణా రహితంగా పొడిచేయడంతో మణికంఠ అక్కడే కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న మణికంఠని చూసిన పక్కింటి వ్యక్తి ఇంటి యజమానికి సమాచారం అందించాడు.అతను పోలీసులకు సమాచారం అందించగా వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు నిందితులను అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు. మద్యం తాగితే మనుషులను బుర్ర పనిచేయదు అనడానికి ఈ హత్య ఉదాహరణగా చెప్పవచ్చును.. మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: