మహిళలు ప్రతి రోజు ఏదొక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రేమ పేరు తో మహిళలను శారీరకంగా, మానసికంగా వాడుకుంటూ దారుణాలు చేస్తున్నారు.  కొందరేమో మోసగాళ్ల చేతిలో ప్రాణాలను కోల్పోతున్నారు. ఆడవాళ్లపై జరుగుతున్న హత్యలకు, అత్యాచారాలను ఎదుర్కొవడానికి ప్రభుత్వం ఎన్నో చట్టాలను అమలు చేస్తున్నారు. అసలు విషయానికొస్తే..ఓ గ్రామ వాలంటీర్ ఓ యువతిని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసాడు. అతని కారణంగా ఆమె గర్భవతిని చేసాడు. 

 

 

 

వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా లో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది.  గ్రామ వాలంటీర్‌ ఓ యువతిని గర్భవతిని చేసి.. పెళ్లి అంటే ముఖం తిప్పేసుకుంటున్నారు. జిల్లాలోని ఉయ్యూరు మండల పరిధి కాటూరు గ్రామం లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  గ్రామానికి చెందిన యువతి ఉయ్యూరు పట్టణంలో అద్దెకు నివాసం ఉంటోంది. బోళ్ల పాడు గ్రామానికి చెందిన గ్రామ వలంటీర్.. ఉయ్యూరు పట్టణంలో సెల్ షాప్ నిర్వహిస్తున్నాడు.

 

 


అలా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి పేరుతో యువతిని నమ్మించి గర్భవతిని చేశాడు. ఈ విషయం చెప్పి పెళ్లి చేసుకోమంటే ససేమిరా అంటున్నాడు. తన మాట విని అబార్షన్ చేయించుకుంటే లక్షల్లో డబ్బు ఇస్తానని, లేకుంటే ఏం చేస్తావో చేసుకో అంటూ బెదిరింపులకు దిగాడు. ఈ విషయం పై యువతీ పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకో లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ తరుణంలో ఉయ్యూరు పట్టణ కాటూరు రోడ్డులోని ఓ ప్రైవేటుు ఆస్పత్రి లో బలవంతంగా అబార్షన్‌ చేయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. యువకుడు ఓసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో తనకు న్యాయం జరగడం లేదని దళిత వర్గానికి చెందిన బాధిత యువతి వెల్లడించింది. తనకు న్యాయం చేయాలనీ కన్నీరు పెట్టుకుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: