ప్రేమ పేరుతో ఈ తరం యువత ప్రలోభాలకు లోనవ్వడమే కాకుండా మోసాలను, నేరాలను చేస్తున్నారు. వారి శారీరక, వ్యక్తిగత అవసరాలకు మాత్రమే ప్రేమిస్తున్నారు.. తీరా వారి అవసరాలు తీరిన తరువాత మొహం చాటేస్తున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలం లో చాలానే వెలుగు చూశాయి. తాజాగా మరో ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను అంటే నమ్మింది.. ఆ నమ్మకమే అతనికి క్యాష్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.. తన దగ్గర ఉన్నంత ప్రియుడికి సమర్పించింది.. అన్నీ పనులు అయ్యాక పెళ్లి మాట ఎత్తగానే అతను జెండా ఎత్తేశాడు..

 

 

 

 వివరాల్లోకి వెళితే.. కాకినాడకు చెందిన వెంకట సురేష్ కుమార్ కొద్ది కాలంగా హైదరాబాద్ ‌లో ఉంటున్నాడు. అతనికి ఓ యువతి తో పరిచయం ఏర్పడింది. ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పి బుట్టలో వేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజాడు. పెళ్లి చేసుకోబోయే వాడే కదా అని ఆమె అందినకాడికి అతనికి సమర్పించింది. తీరా పెళ్లి పేరెత్తగానే తప్పించుకు తిరగడం మొదలు పెట్టాడు. ముఖం చాటేస్తున్నాడని తెలుసుకున్న యువతి మోసపోయానని తెలుసుకుంది..

 

 


వెంటనే పోలీసులను ఆశ్రయించారు.సురేష్ కుమార్ తనను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద పెద్దమొత్తంలో డబ్బులు తీసుకుని మోసం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని.. అతనితో పెళ్లి చేయాలంటూ యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్న వారు సురేష్ ను గాలించి అదుపులోకి తీసుకున్నారు.. అమ్మాయి దగ్గర తీసుకున్న మొత్తం తిరిగి ఇవ్వాలని, అలాగే ఆమెను వివాహం చేసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి వాటిని నమ్మి మోస పోవద్దని యువతను పోలీసులు హెచ్చరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: